మంత్రి నారా లోకేషన్ కలిసిన, క్యాథలిక్ పీఠాధిపతి

 



ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ ను కలిసిన తెలుగు కతోలిక పీఠాధిపతులు. 

అమరావతి, అక్షిత మీడియా;-

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌తో తెలుగు కతోలిక పీఠాధిపతులు సమావేశమయ్యారు. ఉండవల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో మార్చ్ 16 , 2026 న ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఏలూరు, కడప, కర్నూలు, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, ఖమ్మం,  పీఠాధిపతులు మరియు ఛాన్సలర్లు పాల్గొన్నారు. గత ముప్పై ఏళ్లుగా కతోలిక పీఠాల పరిధిలో ఎదుర్కొంటున్న పలు భూసమస్యల గురించి ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌కు వారు వివరించారు. తమ పరిధిలో నడుస్తున్న విద్యా సంస్థల గురించి ఆయనకు పీఠాధిపతులు వివరించారు.తమ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలను సందర్శించాలంటూ లోకేశ్‌ ని  వారు కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి లోకేశ్‌కు వారు తెలిపారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి మంత్రి లోకేశ్ భరోసా ఇచ్చారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview