మహిళల ఉపాధిని దెబ్బతీసే వి.బి.జి. రామ్ జి పథకాన్ని వ్యతిరేకించండి- చంద్ర అరుణ

 







మహిళల ఉపాధిని దెబ్బతీసే వి.బి.జి. రామ్ జి పథకాన్ని వ్యతిరేకించండి- 

చండ్ర అరుణ, పిఓ 

డబ్ల్యు పూర్వ రాష్ట్ర కార్యదర్శి

 

ఇల్లందు ,అక్షిత మీడియా;-


అంతర్జాతీయ మహిళా పోరాట దినం మార్చి 8 అంటే దీనికి కొంత ప్రాధాన్యత వుంది. ఒక చారిత్రిక పోరాటాల నేపథ్యం వుంది. కానీ ఇదోక పండుగ కాదు. సన్మానాలు, సంబరాలు చేసుకోవటం అంతకంటే కాదని అన్నారు 

న్యూయార్క్ నగరంలో పరిశ్రమల్లో పనిచేసే మహిళా కార్మికులు పని గంటల తగ్గింపుకూ, శ్రమదోపిడీకి వ్యతిరేకంగా, వేతనాలు పెరుగుదల కోసం పోరాడి హక్కులు సాధించుకున్న రోజు, హక్కుల సాధన కోసం మహిళలు రక్తతర్పణలు చేసిన రోజు, 1908 మార్చి 8ను ప్రపంచ మహిళల పోరాట దినంగా జరుపుకోవాలని 1910 సం॥ము కోపెన్ హెగెన్లో జరిగిన మహాసభలో జర్మనీ కమ్యూనిస్టు పార్టీ నా యకురాలు క్వారా జర్కీన్ ప్రతిపాదించి ఆమోదింప చేశారని అన్నారు.

ఇల్లందు  మహిళా కార్మికుల అడ్డా సమావేశాలలో, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పట్టణ కార్యదర్శి పాయం వెంకన్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పిఓడబ్ల్యు పూర్వ రాష్ట్ర కార్యదర్శి చండ్ర అరుణ

పాల్గొని మాట్లాడుతూ

ఈనాడు ఒక దేశంలోనే కాదు ప్రపంచ వ్యాపితంగా యుగాలు మారినా, తరాలు మారినా మారనిది మహిళల తలరాతలే, అసమానత్వం, అణచివేత, వివక్ష పురుషాధికృత వంటి సమస్యలు సమసి పోలేదు, మహిళా లోకం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ముందుకు సాగటమే మార్చి 8 సందర్భంగా మనం కర్తవ్యాన్ని దృఢంగా కొనసాగించటం అని వారన్నారు.

మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో కార్మికవర్గం, ప్రజల, మహిళల సమస్యలు మరింతగా పెరిగాయి. వీరి హక్కులపై దాడికి పూనుకుంది. కార్మిక చట్టాలను రద్దు చేసింది. నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చి హక్కులను హరించి వేసింది. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, అసంఘటిత రంగం, సంఘటిత రంగాల్లో దాదాపు 50% మంది పనిచేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి భద్రతలేదు. వేతనాల్లో వివక్ష ఎదుర్కొంటున్నారు. సమాన పనికి సమాన వేతన చట్టం వచ్చి దశాబ్దాలు గడిచాయి. సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చినా పాలకులు ఖాతరు చేయటం లేదని 

గత పది సం॥లుగా బీజేపీ, మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల నేపథ్యమే మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టం పేరు మార్చటం. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా వి.బి.జీ. రామ్ పథకాన్ని పార్లమెంట్లో ఆమోదించింది. ఉపాధి హామీ చట్టాన్ని ఎందుకు రద్దు చేశామంటే లోపాలున్నాయని పాలకులు సమర్థించుకుంటున్నారని, లోపాలు సరిచేయాలి గానీ రద్దు చేయటం పరిష్కారం కాదని అన్నారు. 

ఈ చట్టం 2005లో వచ్చింది. ఈచట్టం ద్వారా ఉపాధి లేని పేదలకూ, వృద్ధులకూ, వికలాంగులకూ, నైపుణ్యం లేని వారికి పని హక్కును కల్పించింది. ఉపాధి కూలీలుగా పనిచేస్తున్న వారిలో 60% మంది మహిళలే వున్నారు. ఈ చట్టం ద్వారా పని కల్పించమని డిమాండ్ చేసే హక్కు ప్రజలకు వచ్చింది. అంతేగాకుండా ఇందులో పనిచేసే మహిళా కూలీ లకు సమాన పనికి సమాన వేతన చట్టం అమలవుతుంది. ఉపాధి కోసం ఇతర చోట్లకు పోకుండా స్థానికంగా పనిచేసే అవకాశం వుంది. పని కల్పించక పోతే భృతి కల్పించమనే హక్కు వుందని 

ఉపాధి దొరకటం వల్ల పేదరికంలో వున్న వారికి వచ్చే ఆదాయం కుటుంబ అవసరాలకు కొంత ఉపయోగపడుతోంది. ఇటువంటి చట్టాన్ని రద్దు చేయటమంటే ప్రజల ప్రాథమిక హక్కుపై దాడి చేయటమే, మోడీ ప్రభుత్వం 2025 డిసెంబర్లో తెచ్చిన వి.బి.జి. రామ్జీ పథకం ద్వారా 125 రోజులు పని కల్పిస్తున్నామని తెగ చెప్పుకుంటోంది. అదే సమయంలో వ్యవసాయ సీజన్లో 60 రోజులు మినహాహించడం వలన ఆ సమయంలో కూలీలకు డిమాండ్ తగ్గి తక్కువ వేతనాలకు పనిచేయాల్సిన స్థితి ఏర్పడుతుంది..

ఈ పథకం ద్వారా పని కల్పించమని డిమాండ్ చేసే హక్కు హరించబడుతోంది. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ వరకే పనులు చేయాల్సి వస్తున్నది. పనులకు తగ్గ బడ్జెట్ అడిగే అవకాశం, అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. పనులు కూడా కేంద్రమే నిర్ణయిస్తుంది. ఫలితంగా ఉపాధి పనులు కుదించటానికి దారి తీస్తుంది. మహిళలు ఉపాధి కోల్పోతారు. కేంద్ర బడ్జెట్లో దాదాపు 15% రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఖర్చవుతుంది. 2024-25 ఆర్థిక సం॥లో ఉపాధి హామీ చట్టం కోసం సుమారు 2,500 కోట్లు ఖర్చయితే ఇందులో రాష్ట్రాల వాటా 1200 కోట్లు మాత్రమేనని వారు ఈ సందర్భంగా అన్నారు. 

 ఈ కార్యక్రమంలో

టియుసిఐ జిల్లా కార్యదర్శి షేక్ యాకుబ్ షావలి, రమణ దుర్గ అరుణ, కోటేశ్వరి నాంచారి యశోద ఉమా సంధ్య ఎల్లా బాయి  , బండారు లక్ష్మి వరలక్ష్మి చంద్రకళ మీనా గౌతమి రాజేశ్వరి కే పద్మ జోష్నా కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు

 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు