*ఇల్లందు నియోజకవర్గంలోని ప్రతి మహిళకు హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు...!!*_
* _*సమాజ అభివృద్ధికి మహిళల పాత్ర అపారమైనది..!!*_
_* *పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతికి పెద్దపీటవేసిన ఘనత తొలి ముఖ్యమంత్రివర్యులు శ్రీ కేసీఆర్ ది....!!*_
_*-మాజీ ఎమ్మెల్యే & నియోజకవర్గ ఇంఛార్జ్ హరిప్రియ నాయక్
ఇల్లందు, అక్షిత మీడియా;-
_అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని ఇల్లందు నియోజకవర్గ *మాజీ శాసనసభ్యులు & ఇంఛార్జ్ శ్రీమతి బానోత్ హరిప్రియ నాయక్ * J.K. కాలనీ వద్ద గల ఇల్లందు నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి కార్యాలయం నందు ఇల్లందు పట్టణ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి నెమలి ధనలక్ష్మి , మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఖమ్మం పాటి రేణుక ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి మహిళ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలతో కలిసి *అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు* ఘనంగా నిర్వహించడం జరిగింది..._
_*ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీమతి హరిప్రియ నాయక్ మాట్లాడుతూ...*_
_ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి తెలంగాణ *తొలి సీఎం శ్రీ కేసీఆర్ హయాంలోనే మహిళలకు సంక్షేమం అభివృద్ధి సాధ్యమైందని గుర్తు చేశారు_.
* _పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో రాష్ట్ర మహిళా అభ్యున్నతి కోసం అమలు చేసిన పనులు అభివృద్ధి కార్యక్రమాలు వారి సాధికారకతకు ఎంతగానో దోహదం చేశాయని గుర్తు చేశారు మహిళల ఆరోగ్యం రక్షణ సంక్షేమంతో పాటు పలు కీలక అభివృద్ధి పథకాల్లో ఆనాటి తొలి ముఖ్యమంత్రివర్యులు శ్రీ కేసిఆర్ మహిళలకే ప్రాధాన్యతను ఇచ్చామన్నారు. మహిళల కోసం కల్యాణ లక్ష్మి పథకం షాది ముబారక్ వంటరి మహిళలకు ఆసరా పెన్షన్లు వంటి అనేక సంక్షేమ పథకాలతో పాటు గర్భిణీ స్త్రీ గా ఉన్న మహిళకు కేసిఆర్ కిట్ కూడా అందించి, ఒక మహిళ గర్భంలో పురుడు పోసుకున్న పసి శిశువు దగ్గర నుంచి గురుకులాల వరకు గురుకులాల నుంచి వారి వివాహంతో కళ్యాణ లక్ష్మి పథకాన్ని అందించి అనేక సంక్షేమ పథకాల అమలు చేశారని వాటితో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా తొలి ముఖ్యమంత్రి వారిలో శ్రీ కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు._
* _తెలంగాణ ప్రగతిలో మహిళలను ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వం భాగస్వామ్యం చేసిందని అదే స్ఫూర్తి కొనసాగాలంటే వారిని మరింత శక్తివంతులుగా తీర్చిదిద్దాలంటే తెలంగాణ అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలంటే మరో మారు కేసీఆర్ ని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని గుర్తు చేశారు..._
_ఈ యొక్క కార్యక్రమంలో 18 వార్డు కౌన్సిలర్ పాబోలు స్వాతి కిరణ్, మాజీ కౌన్సిలర్లు కటకం పద్మావతి, తోట లలిత శారద, వంగుడోత్ తార,ఇల్లందు పట్టణ మహిళా ప్రధాన కార్యదర్శి కొక్కు సరిత, ఉపాధ్యక్షురాలు కడగండ్ల నారాయణమ్మ, పింకీ లోదు, నూర్జహాన్, సంతోషి పాసి, రెహనా, సల్మా,సులోచన, ఎండి అనీఫ్, ఎస్.కె గౌసియా, ఎస్.కె అన్వర్బీ మండల నాయకురాలు తాటికొండ మౌనిక, ఈసం రాజేశ్వరి,మహిళా విభాగం, అభిమానులు పాల్గొనడం జరిగింది..._


0 కామెంట్‌లు