శాంతినికేత న్ స్కూల్ నందు. అగ్ని ప్రమాదంలో అవగాహన కార్యక్రమం

 




శాంతినికేతన్ లో అగ్ని ప్రమాదాలపై అవగాహన

సంగారెడ్డి , అక్షిత మీడియా;-

సదాశివపేట పట్టణం నందు శాంతినికేతన్ విద్యాలయంలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వచ్చే వేసవికాలం దృష్టిలో ఉంచుకొని అగ్ని మాపక సిబ్బంది ఈరోజు అగ్ని ప్రమాదాల నివారణకై పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి మాలి పటేల్ అరవింద శ్రీ ఆధ్వర్యంలో విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కలిగించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అగ్నిమాపక అధికారి ఇన్చార్జి నరసింహారెడ్డి, మారుతి ఇతర సిబ్బంది పాల్గొని వేసవి కాలంలో జరిగే అగ్ని ప్రమాదాలను అరికట్టాలంటే ప్రతి ఒక్కరికి అగ్ని ప్రమాదాల  అంశాలపై అవగాహన ఉండాలని, రాష్ట్ర అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నం చేస్తుంది అని అన్నారు. అందులో భాగంగానే  శాంతినికేతన్ పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు.  వేసవికాలంలో చిన్నారులు సెలవులు రాగానే చెరువుల వద్దకు బావుల వద్దకు కుంటల వద్దకు ఈత నేర్చుకోవడానికి వెళ్తారు అలాంటి సమయంలో కూడా చాలా జాగ్రత్తగా లైవ్ జాకెట్లు ఈత నేర్పించే కోచ్ ఆధ్వర్యంలో ఇతర ఏర్పాటు చేసుకొని నేర్చుకొని జాగ్రత్త ఉండాలని అన్నారు. అదేవిధంగా వేసవికాలంలో మీ కాలనీలో మీ చుట్టుముట్టు ప్రాంతంలో ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగినట్లయితే ఎవరో వస్తారని ఎదురు చూడకుండా మీకు సాధ్యమైనంత వరకు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చి ఆ అగ్ని ఆర్పే ప్రయత్నానికి ఈ శిక్షణ అని అన్నారు .ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview