*ఆదివాసీలకు మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా అడుగులు వేస్తున్న
*గిరిజన ప్రజల కష్టాలకు నేనున్నానoటూ గిరిజన ఆదివాసీలకోసం తానే స్వయంగా ప్రజాదర్బార్ కు కదిలిన సర్పంచ్...*
సారపాక ,అక్షిత మీడియా;-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల సారపాక గ్రామపంచాయతీ పరిధిలోని, మోతెపట్టి నగర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెండు గిరిజన గ్రామాలైన శ్రీరాంపురం పాయం ఎస్టి కాలనీ, చింతకుంట ఆదివాసి గిరిజన ప్రజల కష్టాలను తీర్చేందుకు ప్రజాదర్బార్లో వినతి పత్రాన్ని అందజేసిన సారపాక మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్.
గత 35 ఏళ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటూ ఆ రెండు గ్రామాల్లో జీవనం సాగిస్తున్న సుమారు 400 మంది గిరిజన ఆదివాసి కోయ జాతుల ప్రజలకు కనీస మౌలిక వసతులైన ప్రాథమిక పాఠశాల, ప్రైమరీ హెల్త్ సెంటర్, కరెంటు, మంచినీటి వసతికై మిషన్ భగీరథ పైపులైను, గ్రావెల్ రోడ్డు, ప్రతి ఇంటికి బాత్రూంలు, ఏర్పాటు చేయాలంటూ ప్రజాదర్బార్ కు వినతి పత్రాలు అందజేసిన రెండు గ్రామాల గిరిజన ఆదివాసీలు.
ఆది వాసి గిరిజన ప్రజల తరఫున ప్రజా దర్బార్ కు వెళ్లిన సారపాక మేయర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గుగులోత్ శివరాం కిషోర్ నాయక్ అక్కడి సమస్యలను జిల్లా కలెక్టర్కు వివరించి మా గ్రామ పంచాయతీ తరపున అభివృద్ధి చేద్దామని మేము ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. స్థానిక ఫారెస్ట్ అధికారులు అడుగడుగునా అడ్డుపడుతున్నారని తెలియజేశారు.
గత 30 సంవత్సరాల నుంచి సరైన రోడ్డు సదుపాయం లేక గర్భిణీ స్త్రీలు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయని కలెక్టర్కు వివరించారు. ముఖ్యంగా ఆదివాసి గిరిజన పిల్లలు చదువు బాట పట్టాలంటే ప్రాథమిక పాఠశాల తప్పనిసరి అని అలాగే కనీస వైద్య సదుపాయాన్ని అందించే విధంగా ఆ రెండు గ్రామాలకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, చీకట్లో జీవనం సాగిస్తున్న వారి గ్రామాలకు కరెంటు సదుపాయం కల్పించాలని మరియు రెండు గ్రామాలను అనుసంధానం చేసే విధంగా సుమారు 650 మీటర్లు ఉన్న గ్రావెల్ రోడ్డు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించే విధంగా స్థానిక అటవీ శాఖ అధికారుల ఆంక్షలు తొలగించి పర్మిషన్ జారీ చేయాలని కోరిన సారపాక మేజర్ సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్.
స్పందించిన కలెక్టర్ అన్ని వసతులు అందుతాయని ఆ రెండు గ్రామాల గిరిజన ఆదివాసీలకు తెలియజేశారు, అలాగే ఆ రెండు గ్రామాల ప్రజల అభివృద్ధి కి అడ్డు పడవద్దు అని ఆంక్షలు పెట్టవద్దని అటవీ అధికారులకు తెలియజేశారు.. అలాగే కొత్తగా అడవులు నరికి పోడు చేయవద్దని ఆ గ్రామ ప్రజలకు మరియు ఇప్పటికే చేసుకుంటున్న పోడు ఆక్రమించుకోవద్దని అటవీ అధికారులకు జిల్లా కలెక్టర్ స్పష్టం చేసినట్లు మీడియాకు తెలిపిన గ్రామపంచాయతీ సర్పంచ్ గుగులోత్ శివరాం నాయక్.. ఈ సందర్భంగా సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలియజేసిన చింతకుంట మరియు శ్రీరాంపురం పాయం ఎస్టి కాలనీ గిరిజన ఆదివాసీలు...


0 కామెంట్‌లు