- ప్రజాస్వామ్య బలోపేతంలో యువతే కీలకం
--- ఘనంగా ఖమ్మం జిల్లా స్థాయి 'యువ మాక్ పార్లమెంట్' ఉత్సాహం
--- మహిళలలు అన్నిరంగంలో రాణించాలి జిల్లా మహిళా ప్రాంగణ సంక్షేమ అధికారి వేల్పుల విజేత పిలుపు
ఖమ్మం, అక్షిత మీడియా :::
దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, అపారమైన మేధోసంపత్తి కలిగిన యువత చదువు, ఉద్యోగాల తో పాటు రాజకీయాల వైపు, నాయకత్వం వైపు అడుగులు వేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వేదికగా జరిగిన జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా సాగాయి.
పార్లమెంటరీ విధానాలపై అవగాహన
ఈ కార్యక్రమంలో విద్యార్థులు పార్లమెంట్ సభ్యులుగా మారి, సభా మర్యాదలను పాటిస్తూ దేశం ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యలపై చర్చించారు. ప్రశ్నలు అడగడం, సమాధానాలు చెప్పడం, బిల్లులపై చర్చ వంటి అంశాల్లో తమ ప్రతిభను చాటారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్ పనితీరు, చట్టాల తయారీ ప్రక్రియపై యువతకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.
దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమైనదాని కార్యక్రమ ముఖ్య అతిథి పాల్గొన్న జిల్లా మహిళా ప్రాంగణ సంక్షేమ అధికారినీ వేల్పుల విజేత అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేవలం ఓటు వారు వేయడమే కాకుండా, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. సమస్యలను ప్రశ్నించే తత్వం, విశ్లేషణాత్మక ఆలోచనలు యువతను ఉత్తమ నాయకులుగా తీర్చిదిద్దుతాయనీ కొనియాడారు ప్రజాస్వామ్య రక్షణ కోసం రాజ్యాంగ విలువలపై అవగాహన పెంచుకోవడం ద్వారానే పటిష్టమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించగలం.
రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎంపిక
ఈ జిల్లా స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5 గురినీ ప్రథమ స్థానం ఎం అఖిల, ద్వితీయ స్థానం లావణ్య, తృతీయ స్థానం ఎం డి నదియా హసీన్, 4వ స్థానం పి హనుమంత్, 5వ స్థానం ఎస్ కె హుస్సేన్ బీ విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. మరో 5 గురు ప్రతిభ సర్టిఫికేట్ అందజేశారు. మరో ముఖ్యఅతిథి 36 వ డివిజన్ కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్ రావు మాట్లాడుతూ రాజకీయాల్లోకి రావడం ద్వారానే నిజాయితీ గల నాయకుడు తయారు అవుతారని అన్నారు. ఖమ్మం రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన వారిని జాతీయ స్థాయి యువ మాక్ పార్లమెంట్ కు ఎంపిక చేస్తారనీ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బానోత్ రెడ్డి తెలిపారు.ప్రతినిధులు దేశ రాజధాని ఢిల్లీలో తమ గళాన్ని వినిపించే అవకాశం లభిస్తుంది.
వికాసిత్ భారత్ ప్రోగ్రామ్ ఆఫీసర్ భాను చందర్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బానోత్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ఏ జె రామారావు, ఐ క్యూ ఎ సి కో ఆర్డినేటర్ అసోసియట్ ప్రొఫెసర్ ప్రవీణ్, జ్యూరీ సభ్యులు రాజనీతి శాస్త్ర అధ్యాపకులు బి వెంకటేశ్వర రెడ్డి, ఎస్ ఆర్ అండ్ బిజీ ఎన్ ఆర్ అధ్యాపకులు డాక్టర్ డి ధనమూర్తి, రాజనీతి శాస్త్ర అధ్యాపకులు రవి వర్ధన్, జ్యూరీ సభ్యులు తెలుగు అధ్యాపకులు వెంకటరమణ,మోటివేషనల్ స్పీకర్ తాటిపల్లి సుధీర్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శ్యామల దేవి, రాంకుమార స్వామి, కళాశాల అధ్యాపకులు చేకూరి రమేష్ అసోసియేట్ ప్రొఫెసర్ బొంద్యాల నాయక్ రాజనీతి శాస్త్ర అధ్యాపకులురాలు డాక్టర్ ఎ చరిత్ర అద్దేపల్లి, అధ్యాపకులు పగిడిపల్లి వెంకటేశ్వర్లు, రవిశంకర్ , విద్యార్థినులు, జిల్లా యువజన అధికారులు పాల్గొన్నారు. విజేతలను అభినందిస్తూ, వారు జాతీయ స్థాయిలో కూడా రాణించాలని వారు ఆకాంక్షించారు.

0 కామెంట్‌లు