కసాయి తండ్రి చేతిలో హత్యకు గురైన ముగ్గురు కూతుర్లు

 



కసాయి తండ్రి చేతిలో ముగ్గురు కూతుర్లు బలి

కామారెడ్డి, అక్షిత మీడియా;-

కామారెడ్డి: మొన్న ఇద్దరు.. నిన్న ముగ్గురు.. రెండు రోజుల్లో ఐదుగురు చిన్నారుల మిస్సింగ్‌.. అందులో చెరువులో శవాలై తేలిన ముగ్గురు చిన్నారులు.. ఈ మిస్సింగ్స్‌, డెత్స్‌ కామారెడ్డి జిల్లాలో మిస్టరీగా మారాయి. పదేళ్లలోపు ఐదుగురు చిన్నారులు.. రెండు రోజుల్లో మిస్సవడం.. ముగ్గురు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. ముగ్గురి మృతదేహాలు చెరువులో లభ్యమవడం సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ.. కామారెడ్డిలో ఏం జరుగుతోంది?.. ఈ మిస్సింగ్స్‌, మరణాల వెనుక ఉన్న మిస్టరీ ఏంటి?


కామారెడ్డి టౌన్‌లోని ఆర్‌బీనగర్‌ కాలనీకి చెందిన సీపల్‌, అయాత్, మరియం అనే ముగ్గురు చిన్నారులు నిన్న ఉదయం నుంచి కనిపించకుండా పోవడం కలకలం రేపింది. ముగ్గురూ అక్కాచెల్లెళ్లు కాగా.. రాత్రికి చెరువులో శవాలుగా తేలడం తీవ్ర విషాదం నింపుతోంది. అయితే.. నిన్న ఉదయం ముగ్గురు కూతుళ్లను ఆటోలో తీసుకెళ్లిన తండ్రి.. ఓ షాపు దగ్గర దింపి కిరాయికి వెళ్లినట్లు చెప్తున్నాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయారని తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు పిల్లులు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యాయి. అదేసమయంలో ఆటోకు సంబంధించిన దృశ్యాలు కూడా సీసీ కెమెరా ఫుటేజ్‌లో కనిపిస్తున్నాయి. కానీ.. మిస్సింగ్‌ కేసు నమోదు గాలింపు చేపట్టిన పోలీసులు.. సమీపంలోని చెరువులో ముగ్గురి మృతదేహాలు లభ్యం కావడం షాకిచ్చింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview