కామారెడ్డిలో పిల్లల మిస్సింగ్

 



కామారెడ్డిలో ఒకేరోజు ఐదుగురు చిన్నారుల మిస్సింగ్ కలకలం..

కామారెడ్డి జిల్లా కేంద్రంలో చిన్నారుల మిస్సింగ్ తీవ్ర కలకలం రేపింది. శనివారం (మార్చి 7) ఒకేరోజు ఐదుగురు చిన్నారులు అదృశ్యమయ్యారు.

వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోసంగి కాలనీకి చెందిన సింహాద్రి (10), విజయ్ (09) అనే ఇద్దరు చిన్నారులు తప్పిపోయారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన చిన్నారులు తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.

చుట్టు పక్కలా, బంధువులను ఆరా తీశారు. కానీ ఎక్కడ ఆచూకీ దొరకకపోవడంతో కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేశారు చిన్నారుల తల్లిదండ్రులు.

ఇదిలా ఉండగానే.. జిల్లా కేంద్రంలోని ఆర్బీనగర్ కాలనీకి చెందిన ముగ్గురు అక్క చెల్లెలు సీపాత్ (08), ఆయాత్ (07), మరియం(05) తండ్రితో కలిసి ఆటోలో బయటకు వెళ్లారు. తినుబండరాల కోసం బయటకు వెళ్లిన ముగ్గురు తిరిగి ఇంటికి రాలేదు. ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చిన్నారుల కోసం వెతుకుతున్న పోలీస్ యంత్రాంగం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview