ఉమెన్ లీడర్ షిప్ నేషనల్ అవార్డ్ ప్రధానోత్సవం. నల్ల రాధాకృష్ణ

 


*ఉమెన్ లీడర్‌షిప్ నేషనల్ అవార్డు అందజేత*

తిరుపతిలో ఘనంగా బహుజన అకాడమీ 18వ జాతీయ సదస్సు

సాహిత్యం, సామాజిక సేవలో విశిష్ట కృషికి గౌరవం . నల్లా రాధాకృష్ణ
కోరుట్ల, అక్షిత మీడియా;-

బహుజన సాహిత్య అకాడమీ  ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి గాను ప్రదానం చేస్తున్న ఉమెన్ లీడర్‌షిప్ నేషనల్ అవార్డును..*కోరుట్ల కు చెందిన అంగన్వాడీ టీచర్ మేకల సాయీశ్వరీ* కి మార్చి 15న ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో జరిగిన సౌత్ ఇండియా బహుజన రైటర్స్ 18వ జాతీయ సదస్సులో ఘనంగా అందజేశారు.ఈ అవార్డును బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ, జాతీయ ప్రధాన కార్యదర్శి డా. యు. సుబ్రమనియన్ చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా నల్లా రాధాకృష్ణ మాట్లాడుతూ, ఎస్.సి., ఎస్.టి., బి.సి. మరియు మైనారిటీల సాహిత్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా బహుజన సాహిత్య అకాడమీ ప్రతి సంవత్సరం ప్రజా ఉద్యమకారులు, సంఘసేవకులు, రచయితలు, కవులు మరియు స్వచ్ఛంద సంస్థలకు ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు.సదస్సుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు మరియు పుదుచ్చేరి రాష్ట్రాల నుండి సుమారు 600 మంది ప్రతినిధులు హాజరైనట్లు నిర్వాహకులు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ జి. విష్ణువర్ధన్, కమిటీ సభ్యులు తాటికంటి ఐలయ్య, బాదె వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview