గురుకుల పాఠశాలల్లో అసలు ఏం జరుగుతుంది? నరాల సత్యనారాయణ

 


*తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలలలో అసలు ఏం జరుగుతుంది?*

*టి ఆర్ ఎస్ ( డి) రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ*
కొత్తగూడెం ,అక్షిత మీడియా;-
గురుకుల పాఠశాలలు, విద్యాలయాలను గత బి ఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము గురుకుల పాఠశాలలో విద్యాలయాలలో సరైన వసతులు లేక, విద్యార్థులపై పర్యవేక్షణ లేక అనేక సంఘటనలు జరుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ బీసీ, ముస్లిం మైనారిటీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులపై తీవ్రమైన కక్ష సాధింపులు జరుగుతున్నాయి. ఇటీవల మధిరలో జరిగిన సంఘటన ప్రత్యక్ష ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది. గురుకుల పాఠశాలలో, విద్యాలయాల్లో వాళ్ళకి మంచి పౌష్టికాహారం అందించాలని, నాణ్యమైన విద్యను అందించాలని ఏ ప్రభుత్వమైనా భావిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఎన్నో విశిష్టమైన సేవలు అందిస్తున్నారు. అదే మన తెలంగాణలో చూసుకుంటే విద్యా శాఖకు మంత్రి లేడు. అత్యంత ప్రతిష్టాత్మకమైన, లక్షలమంది బావి భారత విద్యార్థులను నిర్ణయించే శాఖకు మంత్రి లేకపోవడం వల్ల అనేక చిత్ర విచిత్రమైన పరిస్థితులు గురుకుల పాఠశాలలు, విద్యాలయాల్లో చోటుచేసుకుంటున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టిక ఆహారం లేదు. సరైన సౌకర్యాలు లేవు. మానిటరింగ్ చేసే వ్యవస్థ లేదు. అధ్యాపక వ్యవస్థ సరిగా లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వారు నడిపిస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ఏ లక్ష్యముతో అయితే గురుకుల పాఠశాలలను, విద్యాలయాలను ప్రారంభించిందో ఆశయం తెలంగాణలో నెరవేరడం లేదని టిఆర్ఎస్ ( డి) వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ ఆవేదన చెందారు. తెలంగాణలో అత్యంత ప్రముఖమైన విద్యాశాఖకు వెంటనే మంత్రిని ఏర్పాటు చేయాలని గురుకుల పాఠశాలలో, విద్యాలయాల్లో సకల సౌకర్యాలు కల్పించాలని నరాల సత్యనారాయణ డిమాండ్ చేశారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview