అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ ఘాతకానికి యువకుడు మృతి

 




ఇల్లందు పట్టణంలో విద్యుత్ మరమత్తులో భాగంగా ఏర్పాటు చేస్తున్నటువంటి విద్యుత్ స్తంభాలు కొత్త లైన్ల నిర్మాణంలో భాగంగా విద్యుత్ ఘాతకానికి ఉదయ్ కుమార్ (30) మృతి చెందటం జరిగింది. విద్యుత్ ఘాతకానికి కారణం అధికారుల నిర్లక్ష్యం కారణమని ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుస్తుంది. వివరాలకు వెళ్తే స్థానికంగా ఉన్నటువంటి విద్యుత్ అధికారులు, ప్రవేట్ వ్యక్తులను గ్రామాల నుంచి తీసుకువచ్చి నూతన లైన్ ల నిర్మాణం జరిపించడం జరుగుతుంది. నిర్మాణం పూర్తి అవడంతో విద్యుత్ సరఫరా అందించటం కోసం చివరి పరిశీలన లో భాగంగా కుంజ ఉదయ్ కుమార్ ని ఇల్లందు ఫోర్ మెన్ , ఏఈ, సంబంధించిన అధికారులు పైకి ఎక్కేయటంతో విద్యుత్ సరఫరా నడుస్తున్న తరుణంలో అధికారుల సమన్వయ లోపంతో అది తెలుసుకోకుండా పైకెక్కినటువంటి వ్యక్తి విద్యుత్ ఘాతకానికి మృతి చెందడం జరిగింది. మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళన వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు బంధుమిత్రులు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview