అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న సివిల్ సప్లై అధికారులు




 అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న సివిల్ సప్లై అధికారులు 


అక్రమంగా ఇండ్లల్లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత: 


ఇల్లెoదు, అక్షిత మీడియా;-


ఇల్లెందు పట్టణం పరిధిలో సత్యనారాయణపురంలో రెండు ఇండ్లులో నిల్వ ఉన్నట్లు సమాచారం మేరకు, ఇల్లెందు జిసిసి గోడం సమీపాన ఒక ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 100 క్వింటాల బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పట్టుకున్న సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. సివిల్ సప్లై డిటిలు మహేష్, ప్రభాకర్లు తెలిపిన వివరాల ప్రకారం ఇల్లందు మున్సిపాలిటీ సత్యనారాయణపురం లో రెండు ఇండ్లలో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు సమాచారం మేరకు సివిల్ సప్లై అధికారులు దాడీలు నిర్వహించగా ఒక ఇంట్లో 40 కింటాలు, మరో ఇంట్లో రేషన్ బియ్యం అక్రమంగా నిలువ ఉంచినట్లు గుర్తించారు , అలాగే ఇల్లెందు జిసిసి గోడౌన్ సమీపాన ఒక ఇంట్లో 40 క్వింటాలు ఉన్నట్లు గుర్తించి మొత్తం 100 క్వింటాల గిరిజన జిసిసి కేంద్రానికి తరలించారు. ఆ మూడు గృహ యజమానులపై కేసు నమోదు చేసినట్లు డీటీలు తెలిపారు. ఎవరైనా అక్రమార్కులు రేషన్ దందా చేస్తున్నట్టు మీ దృష్టికి వస్తే మాకు సమాచారం అందించినట్లయితే మేము తక్షణమే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఎటువంటి వెనకాడే పరిస్థితి లేదని అధికారులు తెలియజేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview