అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ బియ్యం పట్టుకున్న సివిల్ సప్లై అధికారులు

 


అక్రమ  నిల్వ ఉంచిన పిడిఎస్ బియ్యాo పట్టువేత

లక్ష్మీదేవిపల్లి, అక్షిత మీడియా;-

లక్ష్మీదేవిపల్లి మండలంలోని బంగారు చెలక గ్రామంలో *పీడీఎస్ బియ్యం* అక్రమంగా నిల్వ ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం అందినది. అట్టి సమాచారము మేరకు సంబంధిత గ్రామంలో తనిఖీలు నిర్వహించడమైనది.

తనిఖీలలో భాగంగా, ఆ గ్రామంలోని శ్రీ శ్రీనివాస మోడరన్ రైస్ మిల్ (నాన్-సి ఎం ఆర్ విభాగం) వద్ద సుమారు 607 ప్లాస్టిక్ బస్తాలలో *300.00* క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించడమైనది.

అట్టి పీడీఎస్ బియ్యాన్ని చట్టపరమైన నిబంధనల ప్రకారం సీజ్ చేసి, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయడమైనది.

ఈ తనిఖీలలో జిల్లా సివిల్ సప్లై అధికారి, భద్రాద్రి కొత్తగూడెం; జిల్లా సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ లు , సివిల్ సప్లై కి సంబంధించిన మిగతా అధికారులు పాల్గొన్నారు



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు