నూతన పించన్లు ను మంజూరు చేయాలి

 



నూతన పింఛన్ల ను వెంటనే మంజూరు చేయాలి...


      కలెక్టర్ విజయ సునీత ను కోరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు...


మార్కాపురం, అక్షిత మీడియా;-


          నూతన పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..బుధువారం న మార్కాపురం జిల్లా మొట్టమొదటి కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఎం.విజయ సునీత ను ఆమె కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు.ఈ నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి మాట్లాడుతూ ఎన్ డీ ఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల కాలం పూర్తి కావస్తున్న ఇంతవరకు కొత్త పెన్షన్లను మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.వెనుకబడిన ప్రాంతమైన ఈ నూతన జిల్లా లో నిరుపేద,మధ్యతరగతి కి చెందిన కుటుంబాలు అధికంగా ఉన్నాయని తెలిపారు.వారిలో 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తులను ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.వారి సమస్య పై ప్రభుత్వం దృష్టి సారించి వెంటనే నూతన పెన్షన్లను మంజూరు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా మహిళా అధ్యక్షురాలు షేక్.షబానా, ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని, మార్కాపూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్, ఉమ్మడి ప్రకాశం జిల్లా మైనార్టీ జనరల్ సెక్రటరీ షేక్ అబ్దుల్లా తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview