డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి సంతాపంగా మౌన ప్రదర్శన




 డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి మౌన ప్రదర్శన నిర్వహించిన కార్మిక సంఘాలు 

ఇల్లందు, అక్షిత మీడియా;-

సమ్మెను ప్రభుత్వం నిరంకుశ విధానంతో విచ్చినం చేయాలని చూస్తుంది అన్న దానిని చూసి తట్టుకోలేక నిన్న నర్సంపేట డిపోకు సంబంధించినటువంటి డ్రైవర్ శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం పాల్పడటంతో అతనికి మెరుగైన వైద్యం అందించడం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మృతి చెందిన జరిగింది. మృతి చెందిన శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని వారి కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా అందించాలని డిమాండ్ చేస్తూ, అదే కాకుండా కార్మికుల యొక్క న్యాయబద్ధమైన కోరికలు నెరవేర్చి సమ్మెను విరమింప చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇల్లెందు పట్టణంలో కార్మికులు కార్మిక సంఘాలు మౌన ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు కృష్ణ టి యు సి ఐ నాయకులు యాకోబు షావలి, కార్మిక సంఘాలు, డ్రైవర్లు, కండక్టర్లు, డిపో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview