లిక్కర్ మాఫియాకు అడ్డుకట్టే లేదా!!!
యదేచ్చగా బెల్ట్ షాపులకు మద్యం సరఫరా!!
మాకేందిలే అన్న విధంగా ఎక్సైజ్ అధికారులా!!
ఖమ్మం ,అక్షిత మీడియా;-
రాష్ట్రవ్యాప్తంగా మద్యం వ్యాపారుల జోరు అందుకున్న నేపథ్యంలో అన్ని చోట్ల ఇక్కడ మాత్రం ఒక్క ఎత్తు అన్న విధంగా జరుగుతున్న పరిస్థితి. గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలంలో సిండికేట్ వ్యాపారికి అధికార పార్టీ నాయకుడికి మధ్యలో జరిగిన పేదభిప్రాయాలతో పల్లవి వైన్స్ పై లూటీ జరిగిన పరిస్థితి విలువైన మద్యం సీసాలను స్థానిక ప్రజలు తీసుకెళ్లడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది. అదే కాకుండా అనేక ప్రాంతాలలో బెల్ట్ షాపులకి మద్యం సరపార అమ్ముతున్న ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవట్లేదు అని అనేకచోట్ల కార్యాలయం వద్ద వివిధ రాజకీయ పార్టీ నాయకులు నిరసనలు కూడా వ్యక్తం చేసిన పరిస్థితులు కూడా అనేకం ఈ జిల్లాలో కనిపిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఏమాత్రం అధికారులలో చలనం లేకపోవటం యదేచ్చగా బెల్ట్ షాప్ లకి వాహనాల ద్వారా సరఫరా చేయటం అదే కాకుండా మద్యం షాపులలో కూడా అధిక ధర వసూలు చేస్తున్నారని నాణ్యమైనటువంటి మద్యం వైన్ షాపుల్లో అందుబాటులో లేకుండా పూర్తిగా బెల్ట్ షాపులకే తరలించడంతో మేము కొనుగోలు చేయడానికి అనేక ఇబ్బందులకు గురి అవుతున్నామని మద్యం ప్రియులు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితులు కూడా ఈ జిల్లాల ప్రధానంగా కనిపిస్తూనే ఉన్నాయి. ఒకపక్క లిక్కర్ మాటలతో పట్టణాలలో అన్ని మద్యం కి సంబంధించినటువంటి బ్రాండ్లు లభిస్తున్నాయని చెప్తూనే , కొంతమంది నాయకులు వారికి సంబంధించినటువంటి వ్యక్తులతో కలిసి యదేచ్చగా మద్యాన్ని బెల్ట్ షాపుల ద్వారా విక్రయించడంతో ఒక్కొక్క మద్యం బాటిల్ మీద 40 నుంచి 50 రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది కాబట్టి ఇకనైనా బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకొని ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని ప్రైవేటు వ్యక్తులు వైన్ షాపులు సొంతం చేసుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు కలిసి సిండికేట్ గా ఏర్పాటు ఆదాయాన్ని బెల్ట్ షాప్ రూపంలో ప్రవేట్ వ్యక్తుల జేబులోకి పంపిస్తున్నారు. దీనికి కొంతమంది ఎక్సైజ్ అధికారులు సైతం వారితో చేతులు కలిపి మామూలు వసూలు చేస్తున్నారో అన్న వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి దీనిపై జిల్లా స్థాయి అధికారులు చొరలు చూపించి ఈ విధమైన విధానాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ మధ్యకాలంలో ఇల్లందు పట్నానికి సంబంధించిన మద్యం వ్యాపారికి సంబంధించిన ఆర్థిక లావాదేవీ లో వ్యత్యాసం రావడంతోనే హతక్నిక్ సంబంధించినటువంటి మద్యం షాపులు మూసివేసిన పరిస్థితి కూడా ఈ ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి .దానికి ముఖ్యమైన కారణం సిండికేట్ తోనే ప్రైవేటు వ్యక్తుల యొక్క జేబులు నిండుతాయి కాబట్టి లక్షల రూపాయలు వెచ్చించి మద్యం షాపులు కవిత్వం చేసుకున్నాం కాబట్టి ధనార్జన సంపాదించాలి అని అంటే అది ఒక సిండికేట్ వల్లనే కుదురుతుంది కాబట్టి దానికోసం కొంతమంది అధికార ప్రతిపక్ష వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులకి ,అధికారులకి, కింద నుంచి పై స్థాయి ప్రతి ఒక్కరికి ముడుపులు చెల్లిస్తూ వారి యొక్క మద్యం సిండికేట్ వ్యాపారాన్ని అంచలంచలుగా అభివృద్ధి చెందించుకున్నట్లు జరుగుతుంది. ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులారా ఇకనైనా మేల్కొని రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్ షాప్ లపై ఉక్కు పాదం మోపకపోయినట్లయితే మద్యం ప్రియుడు యొక్క నడ్డి విరిచే విధంగా అతనికి కావలసినటువంటి బ్రాండ్ ఏదైతే ఉందో అవి వైన్ షాప్ లో దొరకని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి బెల్ షాప్ లోకి వెళ్తే అదనంగా 50 నుంచి 100 రూపాయలు జేబులో నుంచి ఖాళీ కావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడే పరిస్థితులు అనేకమున్నాయి కాబట్టి ఇకనైనా ప్రభుత్వం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి ఇలాంటి విధానాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవటమే కాకుండా వారికి సహకరిస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వారిపై కూడా కఠిన చర్యలు తీసుకున్నట్లయితే ప్రజల యొక్క జేబులు ఖాళీయే పరిస్థితులు ఇంకా వాటిలే పరిస్థితి అనేకం కనిపిస్తూనే ఉంటాయి. కాబట్టి వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని అదే కాకుండా ఏదైతే బేవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కాలం నేటికీ కూడా నియమకం చేయకపోవడంతోని పర్యవేక్షించాల్సిన ఎవరైతే అధికారులు ఉన్నారో వారు వారి యొక్క చేతివాటం చూపిస్తున్నట్టు ప్రధానంగా కనిపిస్తుంది కాబట్టి దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతున్న మద్యం ప్రియులు మరిన్ని ముఖ్యమైన సమాచారంతో మీ ముందుకు వస్తాం అక్షిత మీడియా యాజమాన్యం!!!!




0 కామెంట్‌లు