వైద్య వృత్తి కోసం నకిలీ స్థానికత సృష్టించారా!!

 

వైద్య వృత్తి కోసం నకిలీ స్థానికత సృష్టించారా!!

టివివిపి లో జిల్లా స్థాయి అధికారి పాత్ర ఉందా!!

కొత్తగూడెం, అక్షిత మీడియా;-2 వైద్య విధాన పరిషత్ లో వైద్యుల కొరతని అధిగమించాలి అన్న నెపంతో గత ప్రభుత్వంలో వైద్య విధాన పరిషత్ పరిధిలో అనేకమంది వైద్యులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమకాలు జరిపించిన పరిస్థితి మనందరికీ తెలిసింది, దీనిలో అప్పుడున్న ప్రభుత్వం వారి నియమాకాలకు సంబంధించినటువంటి నియమక ప్రక్రియను జిల్లా స్థాయి అధికారులకు అప్పజెప్పటం వారు వారికి నచ్చిన వారిని వైద్య వృత్తిలో చేర్పించుకోవడానికి రాజకీయ ఆర్థిక తోడ్పడుతూ జరిపించినట్లు సైతం అనేక విమర్శలు ఉన్నాయి, ముఖ్యంగా స్థానికత అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వారు తెలంగాణలో పనిచేయటానికి వారికి స్థానికత అనేది చాలా ముఖ్యం, ఒక వైద్యాధికారి స్థానికత ఆంధ్ర ప్రాంతానికి చెందిన విద్యాభ్యాసం పొందినప్పటికీ తెలంగాణ ప్రాంతంలో కంప్యూటర్ ఆధారిత నకిలీ స్థానికతను సృష్టించినట్లు కూడా సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి, దీనికి ముఖ్య కారణం టీవీవిపిలో పనిచేస్తున్నటువంటి ఒక జిల్లా స్థాయి అధికారి యొక్క సాహిత్యం వారితో ఆ వైద్యాధికారులకున్న సంబంధాలతో వారు వైద్య విధాన పరిషత్ లో వైద్య వృత్తిని పొందినట్లు కూడా గతంలో అనేక విమర్శలు ఇచ్చాయి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నియమ కాలంలో అప్పుడున్నటువంటి మంత్రివర్గంలో మంత్రులతో సానిత్య సంబంధం ఉండటం , ఓ మంత్రి గారికి సంబంధించినటువంటి సామాజిక వర్గం బలమైన పునాది వేసుకోవటం. అదే కాకుండా ఆ జిల్లా స్థాయి అధికారికి ఆ మంత్రితో ఉన్నటువంటి సానిత్య సంబంధాలతో ఆ జిల్లా స్థాయి అధికారి కూడా కాంట్రాక్టు ప్రాతిపదికన నియమకం పొంది జిల్లా స్థాయి అధికారి గా పదవి కూడా పొందినట్లు కూడా సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి, తర్వాత వచ్చిన మంత్రులతో కూడా ఆ జిల్లా స్థాయి అధికారికి ఉన్నటువంటి సానిత్య సంబంధాలతో వారికి సంబంధించినటువంటి సిబ్బందికి వారికి అవసరమైన పదవులు ఇప్పించుకోవటం కాంట్రాక్టు ప్రతిపాదికన పని చేస్తున్నటువంటి వైద్యులకు సైతం సూపర్వైజర్ స్థాయి పదవులు ఇప్పించడమే కాకుండా పర్మనెంట్ వైద్యులు ఉన్నప్పటికీ కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేసే సిబ్బంది జిల్లా స్థాయి అధికారి పాత్ర పోషించటం అదే కాకుండా వారికి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఉన్నత స్థాయి అధికారుల పాత్ర పోషించే విధంగా నియమకాలు జరిపించడం అనట్లే ఆ జిల్లాస్థాయి అధికారి పాత్ర ఎంతవరకు ఉందో మనకి కనిపిస్తుంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత ప్రభుత్వంలో అప్పుడున్న మంత్రివర్గంతో సాంఘిక సంబంధాలతో అధిక జీతభత్యాలు సైతం ఇచ్చి ఆ జిల్లా స్థాయి అధికారితో సానిత్య సంబంధాలు ఉన్నటువంటి వైద్యులు ఏర్పాటు చేయడం వారిని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైద్యశాలలలో ముఖ్య పాత్ర పోషించే విధంగా కూడా తయారు చేసినట్లు కూడా విమర్శలు వినిపిస్తున్నాయి, స్థానికత ఒక ప్రాంతం అయితే మరొక ప్రాంతంగా సృష్టించబడటం అనేటి దానికి జిల్లా స్థాయి అధికారుల ప్రోత్బలం లేకపోతే ఆ విధంగా జరుగుతుందా అన్న విమర్శలు సైతం ఆ నోట ఈ నోట వినిపిస్తున్నాయి, పర్మినెంట్ స్థాయి వైద్య వృత్తిలో ఉన్నటువంటి సిబ్బంది అనేకమంది దీనిపై ప్రశ్నిస్తే వారిని స్థాన చలనం కూడా చేపించినట్లు సైతం విమర్శలు ఉన్నాయి, రాష్ట్రంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కాంట్రాక్టు వైద్యవృత్తుల నియమ కాలంలో ఆ జిల్లా స్థాయి అధికారి పాత్ర అనేకం ఉన్నట్లు కూడా విమర్శలు అనేకం వినిపిస్తున్నాయి, దీనిపై వివరణ కోరటానికి చరవాణి ద్వారా ప్రయత్నం చేస్తే కనీసం సంభాషించడానికి కూడా ఎటువంటి అవకాశం కల్పించకుండా తాను అందుబాటులో ఉండను, ఉన్నత అధికారుల దగ్గరికి వెళ్లడం జరుగుతుంది, లేకపోతే ఆసుపత్రిలో పరిశీలన వెళ్లడం జరుగుతుంది, అనే సమాధానం వస్తుంది తప్ప సమయం కూడా కేటాయించని పరిస్థితి కూడా ఆ జిల్లాస్థాయి అధికారికి ఉంది అంటే అధికారి పాత్ర ఏ స్థాయిలో ఉంది అంటానికి నిలువెత్తు నిదర్శనం గా ఇది కనిపిస్తుంది. ఒకరిద్దరూ అధికారులతో సానిత్య సంబంధాలు ఉన్న వ్యక్తులతో తప్ప మిగతా వారిని కలిసే ప్రయత్నం కూడా జిల్లా స్థాయి అధికారి కానీ ఆ కాంట్రాక్ట్ ప్రతిపాదికన పని చేస్తున్నటువంటి వైద్యులు గాని సిబ్బంది కానీ అందుబాటులో ఉండరు. అన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి, అసలు స్థానికత ఆధారంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వైద్య విద్య పూర్తి చేసినటువంటి అనేకమంది వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ స్థానికత లేని వారికి స్థానికత సృష్టించి ఈ ప్రాంతంలో వైద్య వృత్తిలో చేర్పించడం అంటే వారు ఆ జిల్లా స్థాయి అధికారికి ఉన్న సాహిత్యం ఏ స్థాయిలో ఉంది. అని కూడా అర్థమవుతుంది. గతంలో కూడా వైద్యులకి , సిబ్బందికి ఉత్తమ వైద్యులు, సిబ్బందిగా వారికి సంబంధించినటువంటి సిబ్బందికి ఇప్పించుకోవటంలో కీలక పాత్ర పోషించినట్లు కూడా సర్వత్ర విమర్శలు ఉన్నాయి, ఇకనైనా తెలంగాణ రాష్ట్ర వైద్యాధికారులు ఆ జిల్లా స్థాయి అధికారిపై సమగ్ర విచారణ జరిపించినట్లయితే ఆ జిల్లాస్థాయి అధికారికి కన్నుసన్నదలో పనిచేస్తున్నటువంటి స్థానికేతర వ్యక్తులు నకిలీ స్థానికతతో వైద్య వృత్తిలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది వారి యొక్క విధానాలు పూర్తిగా బయటకు వస్తాయి, గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో వైద్యవృత్తిలో పనిచేయటం వచ్చినటువంటి వైద్యులకు జీతభత్యాలలో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం ఇచ్చే జీతభత్యాలకు వ్యత్యాసం ఉండటంతో అనేకమంది స్థానికేతర్లు వారి యొక్క ప్రాంతానికి వెళ్లి పని చేయాలి అన్న వాదన వినిపించినప్పుడు ఆ జిల్లా స్థాయి అధికారి అప్పుడున్న మంత్రివర్గంలో ఒక మంత్రి మరి కొంతమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వారి యొక్క ప్రోత్బలంతో వారికి అధిక జీతభత్యాలు సైతం ఇచ్చి వైద్యవృత్తి చేపించినట్లు కూడా విమర్శలు వినిపిస్తున్నాయి, దీనికి ముఖ్య పాత్ర పోషించినటువంటి ఆ జిల్లా స్థాయి అధికారి కాబట్టి ప్రభుత్వం వైద్యశాఖ మంత్రి వర్గం సమగ్ర విచారణ దీనిపై చేసినట్లయితే స్థానికత లేకున్నా స్థానికత సృష్టించిన వారిపై వారికి సహకరిస్తున్న జిల్లా స్థాయి అధికారిపై చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నాలు చేయాలని ఆ జిల్లా స్థాయి అధికారి వల్ల ఇబ్బందులకు గురైనటువంటి పర్మినెంట్ వైద్యులు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు, మరిన్ని ముఖ్యమైన సమాచారంతో ఆ జిల్లా స్థాయి అధికారి పేర్లు స్థానికేతర లేకున్నా స్థానికేతర సృష్టించి ఈ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి వైద్యులు సిబ్బంది యొక్క పేర్లతో సహా మరొక కథనంతో మీ ముందుకు వస్తాం మీ అక్షిత మీడియా యాజమాన్యం!!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview