సమయపాలన పాటించాల్సిన అవసరం మాకు లేదు!!
మాకు నచ్చినపుడు వస్తాం నచ్చినప్పుడు వెళ్లిపోతాం!!
ప్రశ్నిస్తే వారిపై ఎదురు దాడికి దిగుతాం!!
ఇల్లందు ,అక్షిత మీడియా;-2 రాష్ట్రంలోనే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వారికి నచ్చితే చేస్తాం నచ్చినట్టే ఉంటాం అన్న విధంగా వారి విధానా నడుస్తుంది అంటానికి నిలువెత్తు నిదర్శనమే ఇల్లెందు సబ్ రిజిస్టర్ కార్యాలయం
వారికి విధులకు వచ్చినప్పుడే, సమయం అయినట్లు వారు లేనప్పుడు సమయం కానట్టే అన్న విధంగా వారి విధానం ఉంటుంది అంటానికి 2,3 రోజులు సంబంధించినటువంటి వారి యొక్క కార్యాలయం కు సంబంధించినటువంటి ఖాళీ కుర్చీల దర్శనమిచ్చే ఫోటోలతో సహా ప్రచురితం చేయడానకి సిద్ధ అని తెలిసి కార్యాలయంలో సిబ్బందితో ఎదురు దాడికి సైతం దిగుతాం దీనికి ప్రధాన కారణం కార్యాలయంలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది
అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది తొత్తులతో కలిసి వారు ఆడిందే ఆట పాడిందే పాట అన్న విధంగా వారి విధానం నడుస్తుంది అంటానికి నిలువత్తు నిదర్శనం గా ఇల్లందు సబ్ రిజిస్టర్ కార్యాలయం ఆ కార్యాలయంలో పనిచేసే ఒక సిబ్బంది గతంలో ఏసీబీ అధికారులకు పట్టుబడిన పరిస్థితులు కూడా ఉన్నట్లు కూడా విమర్శలు ఉన్నాయి, అసలు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది పని వేళలు ఏంటి వాళ్ళు ఏ టైం కి వస్తున్నారు, ఏ టైం కు వెళ్తున్నారు, అన్నదానిపై జిల్లా రిజిస్టర్ పరిశీలన చేయకపోవడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది, అసలు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి సిబ్బందిని ఈ ప్రాంతంలో విధుల్లో ఉంచడంతో ఈ విధమైన పరిస్థితిలో ఏర్పడుతున్నాయి అన్న విమర్శలు సైతం ఉన్నాయి ఇకనైనా ఉన్నత స్థాయి అధికారులు ఈ విధమైన విధానాలకు పాల్పడుతున్న సబ్ రిజిస్టర్ కార్యాలయం సిబ్బందిపై చర్యలు తీసుకోకపోయినట్లయితే వారి యొక్క దందాకు అడ్డుకట్ట వేసే నాధుడే లేకుండా పోతుంది. కార్యాలయంలో ఎటువంటి రిజిస్ట్రేషన్ జరగాలన్న ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధర నిర్ణయించి ఆ దర ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి, రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక సిబ్బంది ప్రైవేట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంటరీ తో కలిసి రిజిస్ట్రేషన్ దందాలు కూడా నిర్వహిస్తున్నట్టు కూడా విమర్శలు ఉన్నాయి, ఇకనైనా దీనిపై జిల్లా స్థాయి అధికారులు స్పందించి తక్షణమే సమగ్ర విచారణ జరిపించి విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్న ఈ ప్రాంత ప్రజలు మరిన్ని ముఖ్యమైన సమాచారంతో మరొక కథనంతో మీ ముందుకు వస్తాం మీ అక్షిత మీడియా యాజమాన్యం!!!




