ఏజెంట్ల రాజ్యంలో ఆర్టీవో కార్యాలయాలా!!
సిబ్బంది కాకుండా ప్రైవేట్ వ్యక్తులతో కార్యాలయంలో పనులు నడుస్తున్నాయా!!
అసలు ఎ'''వా'''రో '' సూ'' !!!
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, అక్షిత మీడియా;- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వాహన రిజిస్ట్రేషన్ కానీ, డ్రైవింగ్ లైసెన్సులు కానీ, పాత వాహనాల కాగితాలు రెన్యువల్ కానీ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాహనాల నెంబర్ మార్పులు కానీ, బస్సులో ఫిట్నెస్ లు గాని, ఏ ఇతర రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగాలంటే ఏజెంట్ లేకపోతే ఏమీ జరగని పరిస్థితి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఆర్టీవో కార్యాలయంలో ఉన్న పరిస్థితి, ముఖ్యంగా జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి రెండు కార్యాలయాలు ఖమ్మం గాని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కానీ ఏజెంట్ల రాజ్యం మూడు పువ్వులు ఆరు కాయలు అన్న విధంగా అది కూడా బడా ఏజెంట్ కు ఒక విధంగా చిన్న స్థాయి ఏజెంటుగా మరొక విధంగా అక్కడ వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి, రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా అనేది ఇతర జిల్లాలతో పోలిస్తే భిన్నమైన రాజకీయ ఆర్థిక వ్యవహారాలతో కూడుకున్న ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో పనిచేయడం కోసం ఆర్టీవో కార్యాలయంలో పనిచేసే సిబ్బంది రాజకీయ నాయకుల యొక్క ప్రోత్బలంతో, ప్రదక్షణలతో, ఈ ప్రాంతంలో వారి యొక్క నియమకాలు జరిపించుకోవడం దానికోసం భారీ స్థాయిలో ముడుపులు సైతం చెల్లిస్తున్నట్లు కూడా అనేక ఊహాగానాలు కూడా ఉన్నాయి, ఆ చెల్లించిన ముడుపులకు పదింతలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏజెంట్ల ద్వారా వసూళ్లు సైతం చేస్తున్నట్లు కూడా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి, ముఖ్యంగా కొన్ని కార్యాలయంలో ఆర్టిఏ బోర్డులో సైతం సక్రమంగా ఉండకపోవటం ఆర్టిఏ యాక్టివిస్టులు సమాచారం కోరిన ఇస్తే ఇస్తారు లేకుంటే లేదు అన్న అనుమానాలు సైతం కోకొల్లలుగా వినిపిస్తున్నాయి, గత కొద్దిరోజుల బట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏదైతే వర్షాభావ ప్రభావం ప్రారంభం అయినప్పుడు వ్యవసాయ ఆధారిత వాహన తనిఖీల నెపంతో డాక్టర్లను ఆపి కాగితాలు తనిఖీలు చేసే దాంట్లో తనిఖీల రూపంలో పైకి కనిపిస్తుంది కానీ ఆ తనిఖీల్లో ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చిందో లేదు వారి సొంత జేబులోకి ఎంత ఆదాయం వెళ్ళిందో ఎవరికి తెలియని పరిస్థితి కొంతమంది ఆర్థిక ,రాజకీయ నాయకుల యొక్క వాహనాలు తనిఖీలు చేసినప్పుడు వారు పై స్థాయి రాజకీయ నాయకుల యొక్క దృష్టికి తీసుకెళ్లి మా వాహనాలు ఆపి కూడా మమ్మల్ని కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు దీనిపై అధికారులపై చర్యలు ఉంటాయా లేవా అని సైతం ఫిర్యాదులు కూడా చేసినట్లు ఆ నోట ఈ నోట వినిపిస్తున్నాయి, విద్యా సంవత్సరం ప్రారంభంలో స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బస్సుల యొక్క ఫిట్నెస్ సర్టిఫికెట్ల విషయంలో కూడా అనేక అవకతవకలు జరిగాయి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక బస్సులకు ఫిట్నెస్ లు కానీ ఎమర్జెన్సీ డోర్లు కూడా ఓపెన్ కాకుండా, మెడికల్ కిట్టు కానీ ఫైర్ కి సంబంధించిన పరికరాలు కానీ లేకున్నా మా చేతులు తడిపితే ఎటువంటి సర్టిఫికెట్లు అయినా ఇప్పిస్తాం అని స్కూల్ యాజమాన్యం దగ్గర కొంతమంది ఏజెంట్లు అధికారులకు తొత్తులుగా మారి వారి వద్ద నుంచి భారీ స్థాయి ముడుపులు తీసుకొని బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇప్పించడం కూడా జరిగిందన్న ఊహాగానాలు సైతం అనేకం ఉన్నాయి, ముఖ్యంగా రెండు జిల్లాలకు సంబంధించి డిటిఓ ( డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ )గా పని చేయాల్సినటువంటి అధికారులు వారి యొక్క సొంత అవసరాల నిమిత్తం సెలవులపై వెళ్లటం, వారి స్థానంలో ఇన్చార్జి అధికారులుగా ఉన్నటువంటి వారు మాకేంటి ఇబ్బంది మేము ఉన్నన్ని రోజులు మా పనులు సక్కపెట్టుకుంటాం, తర్వాత ఈ స్థానంలో సెలవులో ఉన్నటువంటి అధికారి తన సెలవులు కాలం పూర్తయిన తర్వాత వచ్చి కుర్చీలో కూర్చుంటారు కదా!!! మా పైకి ఏది రాదు మేము ఆడిందే ఆట పాడిందే పాట అన్న విధంగా మా యొక్క వ్యవహారం చక్కబెట్టుకుంటా0!! దీనికోసం ఆర్టీవో కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి సంబంధం లేనటువంటి సొంత ప్రవేట్ వ్యక్తులను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా వారి యొక్క లాభాపేక్షను పొందుతున్నట్లు కూడా ఊహాగానాలు అనేకం వినిపిస్తున్నాయి, అసలు ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఆర్టీవో కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులు ప్రవేశించడానికి లేదు ఎవరైతే వారి యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం వచ్చిన వ్యక్తులు తప్ప ప్రైవేట్ ఏజెంట్లు లోపలికి రావడానికి లేదు అన్న ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొన్నిచోట్ల ఆర్టీవో కార్యాలయంలో ఏజెంట్లే కంప్యూటర్ ఆపరేటర్లగా కూడా పని చేస్తున్నట్లు కూడా సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి, కార్యాలయంలో ఏజెంట్ల యొక్క అడుగులు పడితే తప్ప కార్యాలయం నుంచి ఒక్క ఫైల్ కూడా బయటకు వెళ్ళని పరిస్థితి, అనేకమంది సామాజిక కార్యకర్తలు దీనిపై అనేకమార్లు ఫిర్యాదు చేసిన అధికారులు నామమాత్రపు చర్యలకే ఉపేక్షిస్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారం దిశగా ఎందుకు, ప్రయత్నించట్లేదు అన్న ఊహాగానాలు సైతం అనేకం వినిపిస్తున్నాయి, అసలు ఆర్టీవో ప్రభుత్వ కార్యాలయంలో డ్రైవింగ్ లైసెన్స్ కి ఒక ధర, వాహన రిజిస్ట్రేషన్లకు మరొక ధర, పాత వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ కి మరొక ధర, వాహనాలు తనిఖీలు చేస్తే ఒక ధర, తనిఖీలు చేయకపోతే మరొక దర, ఫిట్నెస్ ఉన్న బస్సులకు ఒక ధర ఫిట్నెస్ లేని బస్సులకు మరొక ధర అన్న విధంగా ధరలు నిర్ణయించి వారి యొక్క ధనార్జన ప్రజల యొక్క అవసరాలను వారి యొక్క ఆదాయంగా మలుచుకుంటూ ఆ విధంగా దందాలు నిర్వహిస్తున్నట్లు కూడా ఏజెంట్ల ద్వారా నష్టపోయినటువంటి వాహన రిజిస్ట్రేషన్ దారులు అనేకమంది వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ప్రభుత్వం ఇకనైనా ఈ విధమైన విధానాలకు పాల్పడుతున్న కార్యాలయాలపై ఏసీబీ దాడులు నిర్వహించినప్పుడు మాత్రమే కొంత మేరకు ప్రజలకి ఊరట లభిస్తుంది అన్న వాదనను గనుక ప్రభుత్వం ఏకీభవించిన నాడు మాత్రమే ఈ విధమైన ధనార్జనకు పాల్పడుతున్న అధికారుల, ఏజెంట్ల కు భయం భక్తి అనేది కలిగి ఈ విధమైన విధానాలకు పాల్పడరు అని కోరుకుంటున్నా సామాన్య నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వాహన రిజిస్ట్రేషన్ దారుల యొక్క ఆవేదన మరొక కథనంతో ఎవరు అధికారులు ఎవరా ప్రైవేట్ వ్యక్తులు వారి పేర్లతో సహా మరొక కథనంలో పూర్తి వివరాలతో మీ ముందుకు వస్తాం మీ అక్షిత మీడియా యాజమాన్యం!!!
