మోడల్ మార్కెట్ నిర్మాణంలో ప్రమాణాలు పాటించారా!!

 










మార్కెట్ నిర్మాణ లోపమా!!

పాత షాపులను రాజకీయ కక్షతోనే కూల్చివేతా!!

ఇల్లందు ,అక్షిత మీడియా;- ఇల్లందు పట్టణంలో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మాణం చేసినటువంటి మోడల్ మార్కెట్ నిర్మాణంలో నిర్మాణ ప్రామాణిక సక్రమంగా లేకపోవడం షాపుల ఏర్పాట్లు కానీ తీసుకోవాల్సిన నిబంధనలో కానీ ఎలాంటి ప్రామాణికం పాటించకపోవడం ముఖ్యంగా షాపులు కింద పైన అంతస్తు నిర్మాణం జరిగితే, జరిపించిన దానిలో ప్రభుత్వ అధికారులు సమగ్ర ప్రణాళికతో నిర్మాణం జరిపించినట్లయితే ఎటువంటి ఇబ్బందులకు తావు లేకుండా ఉండేవి కానీ నిర్మాణంలో జరిగిన అలసత్వం ఈనాడు మార్కెట్ వివాదానికి రాజకీయ కోణం పూనుకున్న పరిస్థితి, ఉన్నోడు ఉన్నోడుగానే ఉంటే లేనోడు లేనోడు నేనే మిగలనా అన్న సందనంగా మార్కెట్లో మొదటి వైపు ఉన్నవారు షాపుల వద్ద కూరగాయలు, ఆకుకూరలు ఇతర వస్తువులు పెడుతుంటే లోపలి వైపు ఉన్న మాకు ఎటువంటి గిరాకీ లేక ఇబ్బందులకు గురవుతున్నామని కొంతమంది పాత మార్కెట్ స్థానం వైపు వెళ్తుంటే మునిసిపల్ అధికారులు వారిపై కఠిన చర్యలకు ఉపేక్షిస్తున్నారు. దీనివల్ల మేము ఇబ్బందులకు గురవుతున్నాం అని వారి ఆవేదన వ్యక్తం చేసిన ఆవేదన ఆవేదనగానే మిగిలిపోతుంది తప్ప శాశ్వత పరిష్కారం చూపీయట్లేదు మున్సిపల్ పాలకవర్గం అన్న విమర్శలు సైతం ఇల్లందు మోడల్ మార్కెట్లో ఉన్నాయి, అదే కాకుండా పాత మార్కెట్లో కొంత ప్రాంతం మున్సిపల్ ఆధీనంలో ఉన్న మరికొంత ప్రాంతం ప్రవేటు వ్యక్తుల ఆధీనంలో ఉండటం వారు మా యొక్క సొంత షాపులలో మా వ్యాపార లావదేవులు జరుపుకుంటాం అని ముందుకు వస్తుంటే మార్కెట్ కి రావాల్సినటువంటి ఆదాయం రాకుండా పోతుంది కాబట్టి అక్కడ వ్యాపార లావాదేవీలు జరపటానికి లేదు. అని మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వడం అధికార పక్షంలో ఉన్న వర్గ విభేదాలు దీనికి ప్రధాన కారణమైన విమర్శలు సైతం ఆ నోట ఈ నోట వినిపిస్తున్నాయి, కొంతమంది అధికార ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు ఆ మార్కెట్లో ఉండటం వారికి వీరికున్న రాజకీయ కోణంతోనే ఈ విధమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు అన్న విమర్శలు సైతం ఉన్నాయి, దీనికి ఆద్యం పోసే విధంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆ ప్రాంతాన్ని పరిశీలించి టౌన్ ప్లానింగ్ అధికారులు ఏదైతే నిర్మాణానికి మించి ఉన్న ప్రాంతాన్ని మార్కింగ్ చేస్తుంటే నిబంధనలను ప్రశ్నించిన పరిస్థితి, నిబంధన అనుసారం అసలు మున్సిపల్ పరిధిలో ఎంత మేరకు రోడ్లు కానీ ఆక్రమణ కానీ జరిగింది. అన్న సమాచారం తో వచ్చారా అనే ప్రశ్నిస్తే ప్రశ్నకి సమాధానం చెప్పకుండా మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతోనే మేము ఆక్రమాలకు మార్కింగ్లు విధించడం జరుగుతుంది అని సమాధానం చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోవడం వెనక ఆంతర్యం ఏమిటి? ఇది రాజకీయ కోణమా లేక ఏ ఇతర కారణమా!! అన్న విమర్శ బలంగా వినిపిస్తుంది. ఆ ప్రాంతంలో వ్యాపార నిమిత్తం షాపులు ఏర్పాటు చేసుకున్న వారు కొంతమంది టౌన్ ప్లానింగ్ అధికారుల వద్దకు వచ్చి మీరు కేటాయించిన రూములలో కాకుండా ఇతర ప్రాంతంలో వ్యాపార లావాదేవీలు జరపటం వల్ల మీకు అన్యాయానికి గురి అవుతున్నాం, మరి మా పరిస్థితి ఏంటిది మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు. అని ప్రశ్నించడంతో మీ అందరికీ సమాన న్యాయం చేయటం కోసమే ఆక్రమణలను గుర్తించడం జరుగుతుంది అని చెప్పటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన, కొంతమంది షాపులకు సంబంధించిన యజమానులు, అసలు మార్కెట్ నిర్మాణం ప్రామాణికంగా జరిగినట్లయితే ఈ విధమైన విధానాలు రావు, కాబట్టి ప్రభుత్వం తక్షణమే ప్రత్నియమైన మార్గం ఏర్పాటు చేసి మమ్మల్ని కాపాడాలి తప్ప ఈ విధమైన విధానాలతో మేము మార్కెట్లో వ్యాపార లావాదేవులు జరిపించుకోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉన్నది అదే కాకుండా *నిబంధనలకు విరుద్ధంగా షాపులు ఏర్పాటు వల్ల* ముందు వారు వారి ఇష్టానుసారంగా షాపులు ఏర్పాటు చేయడంతో మేము అన్యానికి గురవుతున్నాం కాబట్టి మాకు కూడా న్యాయం జరిగే విధంగా అధికారులు కఠిన నిబంధనలతో షాపుల ఏర్పాటుకు నిబంధనలు విధించినప్పుడు మాత్రమే వెనక ఉన్నటువంటి మాలాంటి చిన్న మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన షాపులు వారు బ్రతకగలుగుతాం తప్ప లేకపోతే మేము బ్రతుకు జీవనం సాగించడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అన్న వాదన కూడా కొంతమంది షాపుల వారు వారి ఆవేదన కూడా వ్యక్తం చేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాం!! మరిన్ని ముఖ్యమైన సమాచారంతో మరొక కథనంతో మీ ముందుకు వస్తాం మీ అక్షిత మీడియా యాజమాన్యం!!!!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview