కార్యాలయంలో అంతా తానే!! ఎవరా వాసు!!

 


కార్యాలయంలో అంతా తానే!!

వాసూ ,దగ్గర ప్రదర్శన చేయకపోతే కార్యాలయంలో ఏ పని జరగదు!!

ఖమ్మం, అక్షిత మీడియా;-ఖమ్మం ఆర్టీవో కార్యాలయంలో అంతా తానే ఒంటి చేతితో నడిపిస్తున్నటువంటి ఉత్తమ కార్యాలయానికి సంబంధం లేనటువంటి ఉద్యోగి. ఉత్తముడి యొక్క కన్ను సైగాలోనే ఏదైనా జరుగుతుంది. ఆ ఉత్తముడు యొక్క ఆదేశాలు అతని వద్దకు ఫైల్ వెళ్లకపోతే జిల్లా స్థాయి అధికారి సంతకం కూడా అవ్వదు అంటానికి ఎటువంటి అతిశయోక్తి లేదు అంటానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నటువంటి ఖమ్మం ఆర్టీవో కార్యాలయం పరిస్థితి ఆ కార్యాలయం పనిచేస్తున్నటువంటి ఒక అధికారికి ప్రైవేటు డ్రైవర్ గా పని చేస్తున్నటువంటి వ్యక్తి ఆర్టీవో కార్యాలయం మొత్తం శాసిస్తున్నాడు అంటే అతను కార్యాలయంలో ఏ విధంగా పాతుకుపోయాడు, అని మనకు తెలుస్తూనే ఉంది. ముఖ్యంగా ఆర్టీవో కార్యాలయంలో రోజువారి లైసెన్సులు కానీ, రిజిస్ట్రేషన్లు కానీ, వాహనాల ఫిట్నెస్ లు కానీ, వాహనాల తనిఖీలు కానీ, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు నిర్ణయించి ఆ వ్యక్తి జిల్లా కార్యాలయం కి రావాల్సినటువంటి ఆదాయం కదా ఆ ప్రైవేట్ వ్యక్తికి అందాల్సిన ఆదాయం ఎక్కువ అంటానికి ఎటువంటి తేడా లని పరిస్థితి. ప్రైవేటు డ్రైవర్ అందులో పని చేస్తున్నటువంటి అధికారులని కానిస్టేబుల్ అని సిబ్బందిని సైతం తాను కన్ను సైగాలోనే వారిని శాసిస్తున్నాడు అంటే కార్యాలయం లో ఉన్నటువంటి ఆ వ్యక్తికి అంత ప్రాధాన్యత ఉందా అంటే అవును అంటానికి ఎటువంటి భేదభిప్రాయం లేనట్టు. రాష్ట్ర చరిత్రలో ప్రవేటు వ్యక్తుల యొక్క దందాతోనే అనేక కార్యాయాలలో పనిచేస్తున్నటువంటి అధికారులు వారి యొక్క కార్యచరణని ఆచరణలోకి తీసుకొస్తున్నారు అంటానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న ఆర్టీవో కార్యాలయం అందులో పనిచేస్తున్నటువంటి డ్రైవర్ పరిస్థితి. రానున్న రోజుల్లో ఇంచార్జ్ అధికారిగా పనిచేస్తున్నప్పుడే ఈ విధమైన విధానాలు ఉంటే పర్మినెంట్ గా ఆదికారే ఆ పదవిలో ఉంటే ఆ డ్రైవర్ ఆడిందే ఆట పాడిందే పాట అన్న విధంగా తన విధానం నడిచే పరిస్థితులు కూడా కనిపిస్తాయి నడిపిస్తాయి చేపిస్తాయి అంటానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ డ్రైవర్ యొక్క ఆదాయ పరిమితి ఎంత ఆ అధికారి ఆదాయం ఎంత అతని ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి తన ఆస్తి ఎంతవరకి అంచలంచలుగా పెరుగుతుంది అంటానికి నిలువెత్తు నిదర్శనం ఆ డ్రైవర్, ఆ డ్రైవర్ యొక్క ఒత్తిళ్లక ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ ఆ అధికారి వద్ద డ్రైవర్ చెప్పిందే వేదం చేసిందే నినాదం అన్న విధంగా ఉంది కాబట్టి మేము ఏమన్నా మాట్లాడితే మా యొక్క ఉద్యోగానికి ఇబ్బందులకు గురి అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి వారు కూడా ఏమి చెప్పలేక అధికారికి కూడా ఆ డ్రైవర్ పై ఎవరైనా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని చూసినా అధికారి కూడా ఆ డ్రైవర్ చెప్పినట్లే వినాలి అతని చెప్పినట్లే చేయాలి అన్న హుకుం జారీ చేయడంతో చేసేది ఏమీ లేక పైకి చెప్పలేక లో లోపల ఆవేదన వ్యక్తం గురవుతున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా అధికారి యొక్క విధానం ఏ విధంగా ఉంటుందంటే ఎవరైనా ప్రశ్నించినట్లయితే వారిని కార్యాలను పిలిపించ వారిపై ఒత్తిడికి గురిచేసి ప్రశ్నించే గొంతుకులను అణగదొక్కాలని సైతం అధికారి , అధికారి డ్రైవర్ ప్రయత్నిస్తున్నారు అన్న విమర్శలు సైతం ఉన్నాయి. ఎవరైనా ఆ డ్రైవర్ యొక్క విధానంపై ఆర్టీఏ ద్వారా వివరణ కోరిన అతనికి కార్యాలయానికి ఎటువంటి సంబంధం లేదు అన్న వాదన వినిపిస్తారు తప్ప. సమాధానం క్లుప్తంగా రాదు. తక్షణమే ఉన్నత స్థాయి అధికారులు, ఏసీబీ అధికారులు, అధికారి అధికారి యొక్క డ్రైవర్ శాఖ పరమైన చర్యలు తీసుకుంటే తప్ప ఈ కార్యాలయంలో జరుగుతున్న దందాని అడ్డుకట్ట వేసే పరిస్థితి ఏమాత్రం ఏమాత్రం ఉండదు. అదే కాకుండా కిందిస్థాయి సిబ్బంది యొక్క పని భారం ఒత్తిళ్ళతో వారు పడుతున్న ఇబ్బందులను సైతం తొలగించే పరిస్థితి కూడా ఉండదు మా ఉద్యోగాలు మమ్మల్ని చేసుకోనివ్వండి దాని కోసం అంతర్గతంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు సైతం ఆ నోట ఈ నోట వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తప్ప బయటకొచ్చి చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. ఆర్టీవో కమిషనర్ తక్షణమే చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్న సిబ్బంది, డ్రైవర్ చేత ఇబ్బందులకు గురవుతున్నటువంటి ఆర్టీవో ఏజెంట్లు, వాహన రిజిస్ట్రేషన్ దారులు తదితరులు మరిన్ని ముఖ్యమైన సమాచారంతో మరొక కథనంతో మీ ముందుకు వస్తాం మీ అక్షిత మీడియా యాజమాన్యం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview