కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ఇల్లందు డిఎస్పి వెంకన్నబాబు

 


కార్డన్అండ్ సెర్చ్ ఆపరేషన్*

ఇల్లందు, అక్షిత మీడియా;- భద్రాద్రి  కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్  ఆదేశాల మేరకు ఇల్లందు డీఎస్పీ వెంకన్న బాబు ఆధ్వర్యంలో శనివారం తెల్లవారుజామున ఇల్లందు సబ్‌డివిజన్ పోలీసు సిబ్బంది, టీజీఎస్‌పీ సిబ్బందితో కలిసి కొమరారం గ్రామపంచాయతీ పరిధిలోని ఇంద్లాతండా గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. 30 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోల ధ్రువపత్రాలు పరిశీలించి సరియైన ధ్రువపత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ మాదకద్రవ్యాల దుర్వినియోగం, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతా చర్యలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామంలో అపరిచితులు లేదా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు గుర్తించిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.అలాగే గంజాయి వంటి అక్రమ మాదకద్రవ్యాల విక్రయాలు, నిల్వలు, గుడుంబా తయారీ లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు, విలువైన మరియు విశ్వసనీయ సమాచారాన్ని అందించిన వారికి తగిన ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని తెలిపారు.ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, టీజీఎస్‌పీ సిబ్బంది కలిపి మొత్తం 60 మంది పోలీసులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview