ఎస్. బాలరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ



ఎస్. బాలరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ

ఉమ్మడి కర్నూలు, అక్షిత మీడియా;_

పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, పార్టీ పేరును దుర్వినియోగం చేస్తే సహించేది లేదు,ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన ఎస్. బాలరాజును సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఆ పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కె. నాగరాజు తెలిపారు*. పార్టీ నిర్ణయాలకు, క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించడం, నాయకత్వంపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.పార్టీ జిల్లా కార్యదర్శి కె. నాగరాజు మాట్లాడుతూ*.. ఎస్. బాలరాజు కొంతకాలంగా పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పార్టీ నిర్ణయాలను పాటించకుండా, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారని తెలిపారు. అంతేకాకుండా, పార్టీ పేరును ఉపయోగించుకుని వ్యక్తిగత పంచాయతీలు నిర్వహిస్తూ అక్రమార్జనకు పాల్పడినట్లు పార్టీ దృష్టికి వచ్చిన అంశాలపై నాయకత్వం తీవ్రంగా పరిగణించిందని అన్నారు.పార్టీలో ఏదైనా అభిప్రాయ భేదం లేదా సమస్య ఉంటే పార్టీ అంతర్గత వ్యవస్థలో చర్చించి పరిష్కరించుకోవాల్సి ఉండగా, పార్టీ నాయకత్వంతో చర్చించకుండా, ఎలాంటి రాజీనామా సమర్పించకుండా ఏకపక్షంగా పార్టీకి దూరమై మరో విప్లవ పార్టీలో చేరడం క్రమశిక్షణా రాహిత్యానికి నిదర్శనమని నాగరాజు పేర్కొన్నారు.పార్టీ జిల్లా నాయకులు ఎం. సత్యన్న మాట్లాడుతూ*.. ప్రజా ఉద్యమాల ద్వారా నిర్మించబడిన విప్లవ పార్టీ పేరును వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదన్నారు. పార్టీపై, నాయకత్వంపై ఆరోపణలు చేసే ముందు వాటిని పార్టీ అంతర్గత వేదికల్లో చర్చించాల్సి ఉంటుందని, వ్యక్తిగత అసంతృప్తిని పార్టీపై ఆరోపణలుగా మలచడం సరైన పద్ధతి కాదన్నారు.పార్టీ జిల్లా నాయకులు ఎస్.ఎం.డి. రఫీ మాట్లాడుతూ*.. పార్టీ క్రమశిక్షణ, రాజకీయ నిబద్ధత, సామూహిక నిర్ణయాలకు ప్రతి కార్యకర్త కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. పార్టీని వీడదలచిన వ్యక్తి పార్టీకి అధికారికంగా రాజీనామా చేసి, తన నిర్ణయాన్ని నాయకత్వానికి తెలియజేయడం ప్రజాస్వామ్య పద్ధతి అని తెలిపారు. అయితే ఎలాంటి చర్చ లేకుండా, రాజీనామా చేయకుండా మరో పార్టీలో చేరడం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమేనన్నారు.సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పేరును గానీ, పార్టీ ప్రతిష్టను గానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎవరైనా దుర్వినియోగం చేస్తే పార్టీ కఠినంగా స్పందిస్తుందని నాయకులు స్పష్టం చేశారు. పార్టీ విధానాలకు, క్రమశిక్షణకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై అవసరమైన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.పార్టీ నిర్ణయాలను ధిక్కరించి, పార్టీతో సంబంధం లేకుండా వెళ్లిపోయిన ఎస్. బాలరాజుకు ఇకపై సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని జిల్లా నాయకత్వం స్పష్టం చేసింది.ఇకపై ప్రజలు,పార్టీ సానుభూతిపరులు,విప్లవ శ్రేణులు,వ్యాపార వాణిజ్య సంస్థలు,మేధావులు అతనికి సహకరించవద్దని కోరారు.ఈ సమావేశంలో  IFTU జిల్లా ఉపాధ్యక్షుడు ఏస్.బాబు,పట్టణ ప్రధాన కార్యదర్శి ఎం.మల్లికార్జున,అంథోనీ,రామచంద్ర pyl జిల్లా నాయకులు ఎస్.మునెప్ప పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview