శ్రీ శ్రీ శ్రీ 108 శివయోగి శివచార్య మహస్వామి జన్మదినోత్సవా వేడుకల పత్రికవిష్కరణ






సంగారెడ్డి , అక్షిత మీడియా;-


సంగారెడ్డి జిల్లా సదశివపేట మండలంలోని తంగేడుపల్లి గ్రామ శివారులో ఎంతో ఆహ్లాద వాతావరణంలో కొలువైన శ్రీ కోటి బిల్వ లింగేశ్వర మఠం శ్రీశ్రీ గురుగంగాధర మహాస్వామి ఆశ్రమ మఠఅధిపతి ష" బ్ర"108 శ్రీశ్రీ శ్రీ శివయోగి శివచార్య మహాస్వామి 31 వ జన్మదినోత్సవ వేడుకలు

శ్రీ పరాభవ నామ సం॥ చైత్ర శు॥ తదియ 22-03-2026 ఆదివారంనాడు సాయంత్రం 4 గం,లకు నిర్వహించే కార్యక్రమం యొక్క పత్రికవిష్కరణ కార్యక్రమం శ్రీ శ్రీ శ్రీ శివయోగి శివచార్య మహస్వామి,స్థానిక సదశివపేట మున్సిపల్ చైర్మన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ,కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చాట్ల సిద్దన్న,వీరశైవ సమాజ జిల్లా అధ్యక్షుడు ఇప్పుపల్లి నర్సింలు, వీరశైవ సమాజం సభ్యులు ,సాద్భక్తుల చేతుల మీదుగా కరపత్రాలను ఆవిష్కరించారు.వారు మాట్లాడుతూ  మార్చి 22వ తేదీ  ఆదివారం నాడు పూజ శ్రీ శివయోగి శివాచార్య మహాస్వామి అప్ప జన్మదినోత్సవం కార్యక్రమం సాయంత్రం 4 గం ఉంటుందని కావున సద్భక్తులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని పూజ అప్ప గారి ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించగలరని ఆవనించారు. అనంతరం జన్మదినోత్సవ వేడుకల సవాస్థలం యొక్క భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview