పులివెందుల చరిత్ర రచనకు తవ్వా కృషి అభినందనీయం-కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి*

 


*



వైయస్సార్ కడప, అక్షిత మీడియా;-


చారిత్రకంగా,రాజకీయంగా, సాంస్కృతికంగా ఘనత కలిగిన పులివెందుల చరిత్ర రచనకు డా.తవ్వా వెంకటయ్య చేస్తున్న కృషిఅభినందనీయమని కడప పార్లమెంటు సభ్యులువైఎస్అవినాష్ రెడ్డి కొనియాడారరు.తనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు కృతజ్ఞతగా మంగళవారం ఉదయం వైఎస్ అవినాష్ రెడ్డిని పులివెందులలోని తన స్వగృహంలో తవ్వా వెంకటయ్య మర్యాద పూర్వకంగా కలిశారు. తాను త్వరలో వెలువరించనున్న పులివెందుల చరిత్ర పుస్తకం గురించి వైఎస్ అవినాష్ రెడ్డి తో చర్చించారు .వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ కడప జిల్లాలో రాజకీయంగా, సాంస్కృతికంగా పులివెందుల తాలూక ఎంతో వైవిధ్యాన్ని పునికి పుచ్చుకుందని గుర్తు చేశారు.   వెంకటయ్య మాట్లాడుతూ తాను రచిస్తున్న పులివెందుల చరిత్రలో పులివెందుల చారిత్రక, రాజకీయ,సాంస్కృతిక , ఆర్థిక అంశాలను విశదీకరిస్తున్నట్లు వివరించారు. పులివెందులను కేంద్రీకృతంగా చేసుకొని వైయస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైయస్ అవినాష్ రెడ్డిలు చేసిన అభివృద్ధిని గురించి పొందుపరుస్తున్నానని చెప్పారు. కేవలం సినీ రంగం వల్ల పులివెందులపై ఏర్పడిన ఫ్యాక్షన్ మచ్చ వాస్తవం కాదని అందుకు భిన్నంగా ఇక్కడ ప్రజల మనస్తత్వాలు, సహజ స్వభావమెంత స్వచ్ఛంగా ఉంటుందో ఉదాహరణలతో రాసినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మున్సిపల్ విభాగం జిల్లా అధ్యక్షులు వల్లంబాయి హృషి కేశవ రెడ్డి, వైసిపి నేతలు శివారెడ్డి, రాజేష్ లు తదితరులు

పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview