నార్కెట్ పల్లి, అక్షిత మీడియా;-
నల్గొండ చండూర్ వాస్తవ్యులు
చేపూరి ముత్యం నిర్మల పెళ్లిరోజు సందర్భంగా వారి కుమారులు చేపూరి శశికర్ ఆకాష్ మరియు కుటుంబ సభ్యుల చే అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిత్యం ఉచిత భోజనం మనం స్వచ్చంద సంస్థ లో 500రోజున నిరుపేదలకు నిస్సహాయ్యులకు బిక్షాటన చేసేవారికి బాటసారులకు అన్నదానం జరిపించారు.మనంలో చోళ్లేటి సాయిరాం తరుపున 6వ సారి అన్నదానం చెయ్యడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు. ముత్యం మాట్లాడుతూ నా యొక్క ప్రతి ముఖ్యమైన రోజులని ప్రతి చోట నిరుపేదల ఆకలి తీర్చటానికే మాత్రమే ఇష్టపడతాను.ఈ సృష్టిలో ఆకలి కీ మించిన లోటు ఇంకోటి ఉండదు అని నమ్మే వ్యక్తి నీ. ప్రతివక్కరు ఆకలితో ఉండకూడదు అని తెలిపారు.ఈ కార్యక్రమం లో నానమ్మ భవాని, అమ్మమ్మ రాజేశ్వరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

0 కామెంట్‌లు