విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం బాధితుడే కారణం



 విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం బాధితుడే కారణం !!

 ఒప్పుకోమనే జిల్లా అధికారుల వైఖరిని ఖండించండి.!!!

అక్రమాలకు పాల్పడే విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలి !!!


కారంపూడి, అక్షిత మీడియా;-


 కారంపూడి మండలం పెదకోదమగుండ్ల విద్యుత్ లైన్మెన్ యం. వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ లైన్మెన్ పరబ్రహ్మచారి ఆతని తమ్ముడు రవి తదితరుల నిర్లక్ష్యానికి బలై వికలాంగుడుగా మారిన దళిత యువకుడు వర్ల సాగర్ బాబు తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సంబంధిత విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని గత 164

రోజులుగా నిరవధిక దీక్షలు చేస్తున్నప్పటికీ జిల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం  వహిస్తూ ఉన్నారు. అంతేగాక రైస్ మిల్లు దగ్గర సాగర్ బాబు పనిచేస్తుంటే పక్కింట్లో ఉన్న ఇన్వేటర్ వల్ల ప్రమాదం జరిగిందని తమ డిపార్ట్మెంట్ కి సంబంధం లేదని రిటర్న్ గా రాసిస్తే ఎంతోకొంత నష్ట పరిహారం రావడానికి ప్రయత్నం చేస్తామని జిల్లా అధికారులు మాట్లాడటం చాలా దుర్మార్గం అయింది. సాగర్ బాబు ఇప్పటికే ఈ ప్రతిపాదన తిరస్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం  స్పందించి జిల్లా విద్యుత్ శాఖ అధికారులపై   చర్యలు తీసుకొని  బాధిత కుటుంబానికి న్యాయం 

 చేయాలని వారు డిమాండ్ చేశారు. 


నకరికల్లు మండలం చేజర్లలో జరుగుతున్న నిరాహారదీక్ష లో 

  ఈరోజు పాల్గొన్నవారు వర్ల సాగర్ బాబు, కేజీయ,   తదితరులు మద్దతు ప్రకటించారు.

1 కామెంట్‌లు

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview