స్మగ్గర్ దాడిలో మృతి చెందిన సౌమ్య సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం



 నిజామాబాద్ అక్షిత మీడియా;-

గంజాయి స్మగ్లర్ల దాడిలో ప్రాణాలు కోల్పోయిన నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. పిభ్రవరి 1న సౌమ్య అంత్యక్రియల సందర్భంగా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు బాధిత కుటుంబానికి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఆ మేరకు ప్రజాప్రభుత్వం బాధిత కుటుంబానికి రూ.కోటి చెక్కు అందించింది. తాజాగా సౌమ్య సోదరుడు గాజుల శ్రవణ్‌కు జూనియర్ అసిస్టెంట్‌ ఉద్యోగ నియామక పత్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు అందజేశారు. 


ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య చనిపోయిన 23 రోజుల్లోనే ఆమె కుటుంబానికి రూ.కోటి మరియు ఉద్యోగం ఇవ్వడం పట్ల ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఉమ్మడి అసోసియేషన్ సభ్యుల కార్యాచరణ కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి బాధిత కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. 


ఈ కార్యక్రమంలో నిజామాబాద్  ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ వి. సోమిరెడ్డి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె. మల్లారెడ్డి, ఇన్స్పెక్టర్ స్వప్న , కానిస్టేబుల్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview