శాంతినికేతన్ లో సైన్స్ దినోత్సవం





 *శాంతినికేతన్ లో సైన్స్ దినోత్సవం*


సంగారెడ్డి , అక్షిత మీడియా;-


సదాశివపేట పట్టణంలో ఫిబ్రవరి 28వ తేదీ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సదాశివపేట పట్టణం నందు శాంతినికేతన్ విద్యాలయం ఉన్నత పాఠశాలలో సైన్స్ దినోత్సవాని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి  పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి మాలిపటేల్ అరవిందశ్రీ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ప్రతి రంగం కూడా సైన్స్ పై ఆధారపడి జీవనం సాగిస్తుంది ఇలాంటి సందర్భంలో ప్రతి విద్యార్థి కూడా సైన్స్ యందు మక్కువ పెట్టి శాస్త్రజ్ఞులే కావాలని లేదు ,సామాన్య జ్ఞానం కూడా సంపాదించాలి అన్నప్పుడు సైన్స్ పై ప్రతి విద్యార్థికి మక్కువ పెంచాలి అని అన్నారు. ఎందరో సైంటిస్టుల త్యాగం ఈరోజు జాతీయ భద్రతా విషయాల్లో కానివ్వండి ,ఆరోగ్య విషయాల్లో కానివ్వండి అనేక కొత్త పద్ధతుల ద్వారా లబ్ధి పొందుతున్నాం. మనం కూడా వారిలా మంచి సైన్స్ పరిజ్ఞానాన్ని సంపాదించి దేశ అభ్యుదయానికి కృషి చేయాలని అన్నారు . విద్యార్థులు తయారుచేసిన నమూనాలను పరికారులను  ప్రయోగాలను పాఠశాల విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ప్రత్యేకంగా తిలకించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు