కంచె చేను మేసింది !!

 





ఆంధ్ర ప్రదేశ్ ,అక్షిత మీడియా;-


జిల్లా కలెక్టరే దేవుని మాన్యం ను ప్రెవేటు వ్యక్తులకు కట్ట బెట్టడం అంటే కంచె చేను మేసి నట్లు ఉందని ఆంధ్రప్రదేశ్ వ్వవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి డి వెంకన్న పేర్కొన్నారు మంగళవారం అయిన ప్రకటన విడుదల చేసారు అనకాపల్లి నడి బోడ్డున ఎన్టీ ఆర్ మార్కెట్ యార్డ్ కోసం 30,37 ఎకారాలు ప్రభుత్వం భూమి సేక రించి భూ సేకరణలో పోయిన భూమి పోగా 1.38 ఎకరాల భూమి దూరి కామమ్మ సత్రం పేరిటే మిగిలి ఉన్న.ఈ భూమి దేవదాయ శాఖ ఆధీనంలో ఉన్నట్టుగా 22 ఏ రికార్డులు చెబు తున్నాయని తెలిపారు.అయితే కొంత మంది అక్రమార్కులు గత 30 ఏళ్లగా ఈ భూమిని కాజేసే ప్రయత్నం లోనే ఉన్నారని అన్నారు. కానీ ఉమ్మడి విశాఖ కలెక్టర్లుగా వ్యవహరించిన వాళ్లెవరూ ఈదేవుని భూముల జోలికి పోలేదని అయితే ఈ భూమిని కాజేసే కుట్రలో భాగంగా సెప్టెంబర్ 6, 2022 న కాండ్రేగుల చినతల్లి పేరుతో ఈ భూమిని 22 (ఏ) నుంచి తొల గించాలని కలెక్టర్ కు ఒక దరఖాస్తు వచ్చింద న్నారు. అయితే అప్పటి కలెక్టర్ దీనిపై స్పందించ లేదని తెలిపారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ దరఖాస్తును జిల్లా కలెక్టర్ బయటకు తీసి దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపించి. జూన్ 21, 2024 న అనకాపల్లి తహసీల్దార్ నుంచి తనకు కావాల్సిన విధంగా రిపోర్ట్ రప్పిం చుకుని. అదే విధంగా మరో వారం రోజుల్లో ఆర్డీవో నివేదికను కూడా విజయ కృష్ణన్ రాయించేశారని తెలిపారు.అప్పటికే ఈ భూమి దేవదాయ శాఖ ఆస్తి కింద టైటిల్న్ ఖాయం చేస్తూ ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ తో పాటు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కూడా అమల్లో ఉన్నప్పటికీ వాటిని కలెక్టర్ ఖాతరు చేయకుండా. దేవదాయ శాఖ ప్రమేయం లేకుండానే తన ఆధీనంలో పని చేసే ఆర్డీవో, మార్కెటింగ్ శాఖ ఏడీ, జోసల్ కమిషనర్,ను తహసీల్దార్లుతో కూడిన జాయింట్ ఇన్స్పెక్షన్ చేయించేసారని పేర్కొన్నారు. అంటే కలెక్టర్ ఒక ప్రైవేట్ పార్టీకి లబ్ధి చేకూర్చడం కోసం దేవదాయ శాఖను పూర్తిగా పక్కన పెట్టేసి నట్టు బలంగా కనిపిస్తుందని అన్నారు ఇదే స్పీడు సామాన్యులకు సంబంధించినటువంటి 22-ఏ ఫైళ్ళ విషయంలోను జిల్లా కలెక్టర్ చొరవ చూపించ లేక పోతు న్నారని పేర్కొన్నారు, ప్రతి సోమవారం కలెక్టరేట్ చుట్టు తిరుగుతూ పీజిఆర్ఎస్ లో వందలాది మంది ధరఖాస్తులు పెట్టుకుని కన్నీరు కారుస్తూనే ఉన్నారని తెలిపారు *దేవరాపల్లి మండల కేంద్రంలో సర్వే నెంబరు 280, 280/1 281/1,లలో కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు స్వాదినం చేసు కోవాలని ఎన్నిసార్లు పిర్యాదు చేసిన అక్రమణ దారుని రక్షించే ప్రయత్నంలో రెవెన్యూ అధికారులు ఉన్నారని తెలిపారు* జిల్లా కేంద్రంలోనే దూరి కామమ్మ సత్రానికి చెందిన ఈదేవదాయ శాఖ భూమి విలువ దాదాపు 40 కోట్ల రూపాయలు ఉంటుందని. ఈ భూమిని కాజే యడం కోసం ప్రైవేట్ వ్యక్తులు చేసిన ప్రయత్నానికి ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన కలెక్టర్ ఏ ఈవిధంగా సహాయ పడ్డారో, ఆమె ఇచ్చిన ఆర్డర్ను చూస్తే అర్ధ మౌవుతుందని తెలిపారు దేవదాయ శాఖ భూములపై ఉత్తర్వు లిచ్చే అధికారం కలెక్టర్క్ లేనే లేదని.తెల్చి చేప్పారు ఎండో మెంట్ అదికారులకు మాత్రమే ఇటువంటి ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు అయితే జిల్లా కలెక్టర్ ఈ భూముల్ను ఇచ్చిన ఉత్తర్వులు పరిశీలించినప్పుడు సర్వే 1539/55 2.49 ఎకారాలకు తన అదికారాన్ని మొత్తం ఉప యోగించి భూమి ఇనామ్ వెట్ కింద ఉంది. ఎస్ఎఫ్ఎ ప్రకారం ఈ భూమి రైతు వారీ మెట్టు అని ఉందని. ఇందులో 1.38 ఎకరాల భూమి డి ఈ ఆర్ ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్ అధీనంలో వారి ప్రహారీ గోడ లోపల ఉందని. ఇప్పుడు ఈ భూమిని 22-ఏలో నోటి ఫై చేయాలని ఇన్స్పెక్షన్ అధికారులు సూచించారని అన్నారు ఏదయితే కాండ్రేగుల చినతల్లి 22-ఏ నుంచి 1.11 ఎకరాల భూమిని మినహాయిం చాలని అడుగుతుందో అది ఇక్కడ వర్తించదని' కలెక్టర్ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారని తెలిపారు అంటే చిన తల్లి అడిగిన భూమికి 22-ఏ వర్తించదు అని స్పష్టంగా తీర్పు ఇచ్చేశారని తెలిపారు.పైగా ఈ చిన తల్లి భర్త ఈభూమికి ఒకప్పుడు కౌలుదారుడు మాత్రమే గానీ యజమాని కానే కాదని. కేవలం చిన తల్లికి లబ్ది చేకూర్చడం కోసం కోట్లాది రూపాయల విలు వైన దేవదాయ శాఖ భూమిని ధారాదత్తం చేసే పనిని కలెక్టర్. పూను కున్నారని తెలిపారు కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వుల్ని చూసి దేవ దాయశాఖ అధికారులు కంగుతింటున్నారని తెలిపారు గత ముప్పై ఏళ్ళ నుంచీ ఈ భూమి దేవదాయ శాఖదే అన్న విషయం అందరికీ తెలిసిందెనని తెలిపారు జిల్లా కలెక్టర్ నియమించిన జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ ఎందుకు ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేసిందని తన పరిధిలో లేని భూమిని 22 ఏ నుంచి మినహా యించే పనికి కలెక్టర్ ఎందుకు అంత శ్రద్ధ చూ పించారని ప్రశ్నించారు? దీనిపై సమగ్ర విచారణ జరపాలని కంచె చేనుమేసినట్లు ప్రభుత్వ హస్తులు కాపాడ వలసిన జిల్లా కలెక్టర్ ఈవిదమైన చర్యలకు పూను కోవడం ప్రజల్లో ఐఎఎస్ అదికారులపై విశ్వాసం పోతుందని వెంకన్న అప్రకటనలో స్పష్టం చేశారు


అబినందనలతో 


*డి వెంకన్న ఆంధ్రప్రదేశ్ వ్వవసాయ కార్మికసంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి*

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు