శ్రీశ్రీశ్రీ దత్తగిరి మహారాజ్ 47వ వార్షిక అమర తిథి సందర్భంగా

 




శ్రీశ్రీశ్రీ దత్తగిరి మహారాజ్ 47వ వార్షిక అమర తిథి సందర్భంగా


సంగారెడ్డి , అక్షిత మీడియా;-


 26-02-2026 నుండి 05-03-2026 37వ పాదయాత్ర బెల్లాపూర్  ఆశ్రమం నుండి బర్దిపూర్ ఆశ్రమం వరకు మాతృశ్రీ అనసూయ మాత, శ్రీశ్రీశ్రీ 1008 వైరాగ్య శిఖామని అవధూత గిరి మహారాజు వారి ఆశీస్సులతో  శ్రీశ్రీశ్రీ 1008 మహంత్ మహామండలేశ్వర్ డాక్టర్ సిద్దేశ్వరనందగిరి మహారాజ్ ఆధ్వర్యంలో  రథయాత్ర పాదయాత్ర పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు 


సద్గురు శ్రీశ్రీశ్రీ 1008 వైరాగ శిఖామణి అవధూత గిరి మహారాజు సంకల్పం సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఏర్పాటుచేసిన అద్వైత సిద్ధాంతకర్త జగద్గురువు ఆదిశంకరాచార్యుల 108 విగ్రహాలు స్థాపించాలని సంకల్పం తీసుకున్నారు 


దత్తగిరి మహారాజ్ 47 వ వార్షిక అమర తిథి సందర్భంగా మొట్టమొదటి  జగద్గురువు ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం బర్దిపూర్ లో విగ్రహ ప్రతిష్టాపన చేశారు 


ఈ కార్యక్రమంలో తడాల అప్పా రాజేశ్వర్ శివ స్వామి మహారాజ్, ఉజ్వల్ రెడ్డి, దత్తగిరి ఆశ్రమ మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అల్లాడి వీరేశం, విశ్వ మానవ ధర్మ అధ్యక్షులు నీలం వెంకటేష్, రంజాన్ రాజయోగ పీఠాధిపతులు రాజయ్య స్వామి, రాజేశ్వర్ శేరి నర్సింగరావు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview