అర్ధరాత్రి నాగుపాము హల్చల్, పట్టుకున్న ప్రాణదార ట్రస్ట్ సభ్యులు

 



అర్ధరాత్రి నాగుపాము హల్చల్, పట్టుకున్న ప్రాణదార ట్రస్ట్ సభ్యులు సంతోష్

ములకలపల్లి, అక్షిత మీడియా:-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం ఒడ్డురామవరం గ్రామంలో అర్ధరాత్రి సమయంలో నాగుపాము ప్రత్యక్షమై గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేసింది. గూగులోట్ జగదీష్ అనే వ్యక్తి ఇంట్లోకి సుమారు ఆరున్నర అడుగుల పొడవున్న నాగుపాము చేరి బుసలు కొడుతూ కుటుంబ సభ్యులను భయపెట్టింది.దీంతో వెంటనే గ్రామస్తులు కొత్తగూడెం కు చెందిన ప్రాణధార ట్రస్ట్ అధ్యక్షుడు సంతోష్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సంతోష్ వెంటనే స్పందించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అప్రమత్తం చేశారు. అనంతరం ట్రస్ట్ సభ్యులు ఎన్. శ్రీకాంత్ (చోటు), తుమ్మ శ్రీకాంత్‌తో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు.సుమారు రెండు గంటల పాటు శ్రమించి, కర్రల్లో దూరిన నాగుపామును చాకచక్యంగా బయటకు తీసి సురక్షితంగా పట్టుకుని బంధించారు. అనంతరం గ్రామస్తులకు పాముల గురించి అవగాహన కల్పిస్తూ సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview