టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబయ్య పై చర్య తీసుకోవాలి. పిడియం
నరసరావుపేట ,అక్షిత మీడియా;-
నరసరావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్డు లో ఉన్న ఆవులు సత్రం ప్రక్కన కత్వ చెరువు డ్రైనేజీ కాలువలో
పట్టపగలు ఆక్రమణ దారులు యదేచ్ఛగా నిర్మాణాలు (పిల్లర్స్) చేస్తున్న చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న నరసరావుపేట మున్సిపల్ అధికారులు , గత రెండు రోజుల కిందట ప్రజాసంఘాలు ఆ ప్రాంతాన్ని పరిశీలించి అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని వెంటనే నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవాలని నరసరావుపేట తాసిల్దార్ కి , మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి సాంబయ్య కి తెలియజేయగా సాంబయ్య పనులు ఆపించామని చెప్పడం జరిగింది . కానీ యదేచ్చగా పట్టపగలు నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి
ఆక్రమణదారులతో కుమ్మక్కైన సాంబయ్య పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.


0 కామెంట్‌లు