ప్రభుత్వ స్థలాలను కబ్జాలు చేస్తూన్న హరి అనే ఉద్యోగి పై చర్య తీసుకోవాలీ




 బినామీ పేర్లతో ప్రభుత్వ స్థలాలను కబ్జాలు చేస్తున్న మున్సిపాలిటీ హరి పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి 


రాయచోటి , అక్షిత మీడియా;-


ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి దగ్గరయ్యి రాయచోటి టౌన్ లో బినామీ పేర్లతో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్న మున్సిపాలిటీ హరిపై తక్షమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ (ఎంఎల్ )లిబరేషన్ పార్టీ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాథ్ డిమాండ్ చేశారు శుక్రవారం మున్సిపాలిటీ హరి ఆక్రమించుకున్న  స్థలాన్ని  ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో చిన్న ఉద్యోగం చేసుకుంటున్న హరి ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టారని ఆయన అన్నారు  ఎంతోమంది పేదల కడుపు కొట్టిన వ్యక్తి మున్సిపాలిటీ హరి అని  ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న ఆ పార్టీకి కొమ్ముగాస్తూ ఆ పార్టీని అడ్డుపెట్టుకొని విచ్చలవిడిగా అనామకుల పేరల మీద ప్రభుత్వ స్థలాలు  కబ్జాలు చేస్తూ అద్దాల మేడలు కట్టుకొని అర్హత కలిగిన పేదలకు దక్కకుండా ఎక్కడపడితే అక్కడ ప్రభుత్వ స్థలాలను  కబ్జా చేస్తున్నారని ఆయన విమర్శించారు ప్రతిరోజు మున్సిపాలిటీ హరి చేస్తున్న ఘనకార్యం ఏమిటంటే రాయచోటి చుట్టుపక్కల ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయని సర్వే చేసుకుంటే అక్కడ అల్లా గద్దల వాలి అధికారులను మేనేజ్ చేసుకుంటూ అధికార పార్టీ నాయకులను  మేనేజ్ చేసుకుంటూ విచ్చలవిడిగా  దోసుకుంటున్న మున్సిపాలిటీ హరిపై తక్షణమే విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఎవరైనా నాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే ఎదురు దాడి చేస్తూ తున్నాడని ఆయన ఆరోపించారు ఇప్పటికైనా రెవిన్యూ అధికారులు మున్సిపాలిటీ కమిషనర్  అతనిపైన కన్ను వేసి అతని వ్యవహారాలన్నీ కూడ బయటికి లాగి అతన్ని తక్షణమే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు  ఏమైనా మాట్లాడితే నేను ఎస్సీ ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాను అంటూ రెచ్చిపోతున్నాడని ఆయన అన్నారు సాటి దళితులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలా నమోదు చేయిస్తారో అర్థం కాలేదన్నారు ఇప్పటికైనా అధికారుల స్పందించి చర్యలు చేపట్టాలని ఆయన కోరారు  లేనిపక్షంలో సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు


కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview