నాసిరకం సీసీ రోడ్డు నిర్మాణం చేస్తున్న, పట్టించుకోని అధికారులు

 




నేనే రాజు నేనే మంత్రి!!

రోడ్డు నిర్మాణం నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా!!

నిర్మాణం పై పర్యవేక్షించాల్సిన అధికారులు ఎక్కడా!!!

నిర్మాణ పనులను అడ్డుకున్న ఏడవ వార్డు నెంబర్ కరకపల్లి రాజేశ్వరి

ఇల్లందు ,అక్షిత మీడియా;-

ఇల్లందు మండలం తిలక్ నగర్ పంచాయతీ పరిధిలో ప్రభుత్వం అభివృద్ధి పనుల్లో భాగంగా 35 లక్షల నిధులతో సిసి రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగింది దానిలో  భాగంగా

నిర్మాణం పనులు చేస్తున్నటువంటి గుత్తేదారుడు నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా కూడా పాటించట్లేదు పాటించట్లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏవైతే ఉపయోగించాల్సినటువంటి మెటీరియల్ ఉందో అవి ఉపయోగించకుండా నిర్మాణ చేపిస్తున్నారు. కాబట్టి తక్షణమే వీటిని ఆపాలని ఆపడం జరిగింది. దీనిపై పంచాయతీ ఏడో వార్డు నెంబర్ కరకపల్లి రాజేశ్వరి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ఏ విధమైన నాణ్యత ప్రమాణాలు పాటించట్లేదు పైగా దీనిని ప్రశ్నించినందుకు అధికార పార్టీ అండదండలు మాకు బలంగా ఉన్నాయి మమ్మల్ని అడ్డుకున్నట్లయితే మీకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అని బెదిరింపు దూరంలో కూడా అవలంబిస్తున్నారని వారు తెలియజేయడం జరిగింది. అధికారులు ఏమాత్రం పర్వేక్షణ చేయకపోవడం వెనక వారి యొక్క చేతివాటమా లేక అధికార పార్టీ ఒత్తిళ్ళ తెలవవలసిన పరిస్థితులు ఉంది. జిల్లా కలెక్టర్ పంచాయతీరాజ్ అధికారి తక్షణమే దీనిపై సమగ్ర విచారణ జరిపించి నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview