పోషణ అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. కోదండరాం

 



*పోషణ అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి*

 *రాష్ట్ర మహిళా ,శిశు, సంక్షేమ శాఖ సెక్రెటరీతో భేటీ అయిన ప్రో: కోదండరాం*

హైదరాబాద్, అక్షిత మీడియా;-

 *రాష్ట్రంలో పోషణ అభియాన్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ మంగళవారం నాడు స్థానిక సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనితా రామచంద్రన్ తో ప్రొఫెసర్ కోదండరాం భేటీ అయ్యారు. రాష్ట్రంలో పోషణ అభియాన్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలైనటువంటి ఉద్యోగ భద్రత, కాంట్రాక్ట్ రెన్యువల్ పొడిగింపు, జీతభత్యాలు పెంపు,హెల్త్* *ఇన్సూరెన్స్* , *శాఖలోని మెటర్నటీ సెలవల విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలపై పోషణ అభియాన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పొనుగోటి సంపత్ నేతృత్వంలో పలు సమస్యలపై కోదండరాం చర్చించడం జరిగింది* . *ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ దేశంలోనే పోషణ అభియాన్ పథకం అమలులో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలిచిందని, ఈ యొక్క పథకం అమలుకై , అంగనవాడి కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులకు నాణ్యమైన సేవలు అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న పోషణ అభియాన్ సిబ్బంది అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా మారుతున్న కాలానుగుణంగా వారి జీతభత్యాలు పెంపుదలకు కృషి చేయాలని, క్రమం తప్పకుండా వారి యొక్క కాంట్రాక్టు క్రమబద్ధీకరణ పొడిగించాలని, క్షేత్రస్థాయిలో* *పనిచేస్తున్న సిబ్బందికి ఆరోగ్య భద్రతతో కూడిన ప్రభుత్వ పాలసీలు అమలుపరిచే విధంగా ప్రణాళిక రూపొందించాలని, పని భారం పెరగకుండా మానసిక ఒత్తిడికి లోను కాకుండా ఉండాలంటే అత్యాధునిక సాంకేతిక* *పరిజ్ఞానంతో కూడిన పరికరాలు సిబ్బందికి అందజేసినట్లయితే అంగన్వాడి సేవలు సులభతరం అవుతాయని కోదండరాం తెలిపారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనితా* *రామచంద్రన్ మాట్లాడుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశానుసారం రాష్ట్రంలో పోషణ అభియాన్ పథకం పగడ్బందీగా అమలు అవుతుందని, క్షేత్రస్థాయిలో పోషణ అభియాన్ సిబ్బంది అందిస్తున్న సేవల ఆధారంగానే దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రానికి నీతి అయోగ్ ద్వారా ప్రత్యేకమైన గుర్తింపు లభించింది అని, ఉద్యోగుల కాంట్రాక్ట్* *రెన్యూవల్ విషయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ పోర్టల్ లో సాంకేతిక సమస్య ఏర్పడడంతో ఈ ఆర్థిక సంవత్సరం కాంట్రాక్ట్ క్రమబద్ధీకరణ కొద్దిగా ఆలస్యం జరిగిందని, ఈ రెండు మూడు రోజుల్లో ఆ సమస్యను పరిష్కరించి* *ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ఉద్యోగుల జీతభత్యాల పెంపునకు గవర్నమెంట్ ఆఫ్* *ఇండియా కి రాష్ట్ర మహిళా* *శిశు సంక్షేమ శాఖ ద్వారా* *ప్రతిపాదనను పంపించడం జరిగిందని అది త్వరలో అమలుపరుస్తామని, ప్రతి ఉద్యోగికి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి అతి తక్కువ ప్రీమియంతో కూడిన హెల్త్ పాలసీ వర్తించే విధంగా, ఆ యొక్క మొత్తం* *కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుందని, అంగనవాడి టీచర్లకు అందజేస్తున్న మొబైల్ సేవలను పోషణ అభియాన్ సిబ్బందికి కూడా అందే విధంగా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయడం* *జరుగుతుందని, పోషణ అభియాన్ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు అంగనవాడి కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవల నాణ్యతలను పర్యవేక్షిస్తూ పిల్లలు, గర్భిణీలు, బాలింతలు మరియు కిశోర బాలికల ఆరోగ్య స్థితిగతులు ఎప్పటికప్పుడు ప్రత్యేక నివేదిక తయారుచేసి ఆరోగ్య* *తెలంగాణ నిర్మాణానికి భాగస్వామ్యం కావాలని అనిత రామచంద్రన్ పేర్కొన్నారు. ఈ యొక్క సమావేశంలో పోషణ అభియాన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పొనుగోటి సంపత్, రాష్ట్ర కార్యదర్శులు నాగులవంచ సతీష్, శైలజ, సరిత తదితరులు పాల్గొన్నారు.*

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview