వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన కూకట్పల్లి పోలీసులు

   



వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన కూకట్పల్లి పోలీసులు


హైదరాబాద్ , అక్షిత మీడియా;-

 నగరంలోని కూకట్‌పల్లి ప్రాంతంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాపై సైబరాబాద్ పోలీసులు దాడులు నిర్వహించి పలువురిని అరెస్టు చేశారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) పోలీసులు పక్కా సమాచారంతో సుమిత్రనగర్‌లోని వేర్వేరు అపార్ట్‌మెంట్లలో శనివారం రెయిడ్ నిర్వహించారు.


పోలీసుల వివరాల ప్రకారం, కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని సుమిత్రనగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార కేంద్రాలు నడుస్తున్నట్లు సమాచారం అందడంతో అధికారులు దాడి చేపట్టారు. ఈ దాడుల్లో ఇద్దరు నిర్వాహకులతో పాటు పలువురు కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు