పంచాంగ శ్రవణం స్వామి వారి జాతకం చెప్పిన గండయ్య స్వామి

 




మల్లికార్జున స్వామి దేవాలయంలో పంచాంగ శ్రవణం... స్వామివారికి జాతకం చెప్పిన అంకెనపల్లి గండయ్య  స్వామి..

సంగారెడ్డి , అక్షిత మీడియా;-

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ,ఏ పేరున పిలిచిన పలికే ఆ మల్లికార్జున స్వామి జాతకం ఈ పరాభవ నామ సంవత్సరంలో మూడు పూవులు ఆరు కాయలుగా ఉందని పంచాంగ శ్రవణంలో గంగయ్య స్వామి అన్నారు. 1983- 84 పదవ తరగతి పూర్వ విద్యార్థుల మిత్రబృందం ఆధ్వర్యంలో సదాశివపేటలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో బసవరాజు స్వామి  అష్టోత్తర శతనామాలు పట్టిస్తుండగా మిత్రులంతా కలిసి  విశేషంగా అభిషేకం చేశారు. గురువారం ఉగాది పర్వదినం నుండి పరాభవ నామ సంవత్సరం తెలుగువారి నూతన సంవత్సరం ప్రారంభమవుతున్నందున షడ్రుచుల తో కూడిన పానకాన్ని  స్వామివారికి ఇష్టమైన పంచభక్షాలను నైవేద్యంగా సమర్పించారు. గంగయ్య స్వామి ఆధ్వర్యంలో ఈ కొత్త సంవత్సరంలో మనుషుల జాతకాల గురించి కాలచక్రంలో జరిగే పరిణామాల గురించి వివిధ రాశుల పనితీరు గురించి ఆయన పంచాంగ శ్రవణం చేస్తూ వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల మిత్రబృందం అధ్యక్షుడు గంట శివయ్యతో పాటు పులిమామిడి వీరేశం, పృథ్వీరాజ్, శంకర్ గౌడ్ ,రవి ,కంది కృష్ణ, చిన్న పటేల్ ,నర్సింగ్ రావు, కృష్ణ, నాగరాజు, శ్రీనివాస్ రెడ్డి, శత్రజ్ఞుడు, నందీశ్వర్, శంకరప్ప,దయానంద్ మరియు భక్తులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview