ఉపాధ్యాయుల జీతాలపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. కేశవరావు

 


*టీచర్ల జీతాలపై ఇంకా నిర్ణయం లేదు: కేశవరావు*

హైదరాబాద్, అక్షిత మీడియా;-

ప్రభుత్వం ఉపాధ్యాయుల జీతాలను తగ్గించే ఆలోచన లేదని ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు స్పష్టం చేశారు. టీచర్ల జీతాల అంశంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

ఉపాధ్యాయ సంఘాలను పిలిచి చర్చలు జరిపిన తరువాతే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం జారీ చేసే అన్ని జీవోలను ప్రజలకు అందుబాటులో ఉండేలా పబ్లిక్ డొమైన్‌లో ఉంచుతున్నామని చెప్పారు.

ఇంకా నెలరోజుల్లో కొత్త విద్యా విధానాన్ని ప్రభుత్వం తీసుకురానుందని వెల్లడించారు. విద్యా సంస్కరణల కోసం ఇప్పటివరకు విద్యా కమిషన్ మొత్తం 14 కమిటీలను ఏర్పాటు చేసిందని కేశవరావు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

✂ Image Crop Editor
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview