సీతారామ ప్రాజెక్టు పనులను తక్షణమే పూర్తి చేయాలి
నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలి
కామేపల్లి మండలం లింగాల వద్ద రాస్తారో
కామేపల్లి, అక్షిత మీడియా;-
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని , సీతారామ ప్రాజెక్టు పేరు మీద రైతుల వద్ద నుంచి భూమి సేకరించి సీతారామ ప్రాజెక్టు కాలువల నిర్మాణం చేస్తామని చెప్పి ప్రజలను నమ్మబలికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాల్లో నుంచి ఈ కాల్వ వెళ్తుండగా ముఖ్యంగా కామేపల్లి మండలంలో 150 మంది రైతుల వద్ద నుంచి భూమి స్వీకరిస్తున్నామన్న నెపంతో ప్రభుత్వం సర్వే నిర్వహించి సర్వే ఆధారంగా భూమి రికార్డుల లో నుంచి తొలగించడం వల్ల గత ఐదు సంవత్సరాల బట్టి రైతుబంధు రుణమాఫీ రాక సొసైటీ నుంచి పంటకు సంబంధించిన ఎటువంటి సబ్సిడీ ఎరువులు కానీ విత్తనాలు కానీ లభించక రైతులు అరగోష పడుతున్నారు.కాబట్టి తక్షణమే ప్రభుత్వ స్పందించి ఈ ప్రాంతం లో ప్రభుత్వం మరొకసారి పునర్ ఆలోచన జరిపి ఈ బడ్జెట్ సమావేశంలోne 5000 కోట్ల రూపాయలతో సీతారామ ప్రాజెక్టు నిర్మాణం కి సంబంధించిన డిపిఆర్ సిద్ధం చేసి ఈ ప్రాంతంలో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కామేపల్లి మండలం లింగాల వద్ద రాస్తారోకు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దుగ్గి కృష్ణ తెలంగాణ వ్యవసాయం రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, నాగభూషణం ,శ్రీనివాస్ రెడ్డి ,శ్రీనివాస్ ,వెంకన్న ,వీరన్న హజ్య, రమేష్, రమణ, షరీఫ్, శిరీష ,నవీన్ తదితరులు పాల్గొన్నారు



0 కామెంట్‌లు