కాలుష్య పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలి. గొల్లపల్లి జయరాజు

 



*కాలుష్య పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలి*

 **రైతు సంగం జిల్లా ఉపాధ్యక్షులు గొల్లపల్లి జయరాజు* 


సంగారెడ్డి , అక్షిత మీడియా;-


సంగారెడ్డి జిల్లాలోని కాలుష్య పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని 

రైతు సంగం జిల్లా ఉపాధ్యక్షులు గొల్లపల్లి జయరాజు ప్రభుత్వంను డిమాండ్ చేశారు.

 రైతు సంగం ఆధ్వర్యంలో పిసిబి కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనిర్ శ్రవణ్ కు వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని కాలుష్య కారక పరిశ్రమల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల కాలుష్యం వల్ల పశువులు, చేపలు చనిపోతున్నాయని అన్నారు. మునిపల్లి మండలంలోని రియొమ్ పరిశ్రమలు కాలుష్యం వల్ల బర్లు చనిపోయనవని అన్నారు.మంజీరా నీళ్లు కలుషితం అవుతున్నాయని అన్నారు.తక్షణమే కాలుష్య పరిశ్రమలపై చర్యలు తీసుకొని రైతులకు ప్రజలకు న్యాయం చేయాలనీ అన్నారు. ఈ కార్యక్రమం జిల్లా సహాయ కార్యదర్శి రమేష్ గౌడ్, రైతులు నాగేష్ మహిపాల్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview