కాలుష్య పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలి

 


*మంజీరాలో చేపలు మృతిపై విచారణ జరిపించాలి*
*కాలుష్య పరిశ్రమ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలి*
*మత్స్యకారులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి*

*సిపిఎం సంగారెడ్డి జిల్లా కార్యదర్శి  గొల్లపల్లి జయరాజు*

సంగారెడ్డి , అక్షిత మీడియా!-

*మంజీర నదిలో చేపలు మృతిపై విచారణ జరిపించాలని* సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.
హత్నూర మండలం పల్పనూరు గ్రామం లో మంజీరా కాలుష్యం జలాలు, చనిపోయిన చేపలను పరిశీలన చేయటం జరిగింది.ఈ సందర్బంగా ఆయన మత్స్యకారులతో మాట్లాడుతూ మీరు ధైర్యంగా ఉండాలని అన్నారు. కాలుష్యం కూ  కారణమైన కంపెనీ యాజమాన్యాల పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం కాలుష్యం బారిన పడి పెద్ద ఎత్తున మంజీరా కలుషితమవుతుందని విమర్శించారు చేపలు జీవరాసులు చనిపోతున్నాయి పశువులకు వ్యవసాయానికి నీళ్లు కలుషితం అయిపోతున్నాయని అన్నారు. పాల్పనూరు, వెండికోల్, అంగడిపేట, లింగంపల్లి గ్రామాలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నార్ని అన్నారు.కాలుష్యం పై చర్యలు తీసుకోవాల్సిన ఈసీబీ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తు న్నారని  అన్నారు తక్షణమే వైసీపీ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మత్స్యకారులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని వారిని ఆదుకోవాలని అన్నారు మంజీరా పరిరక్షణ కోసం సిపిఎం ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు విద్యాసాగర్ నాయకులు  పి అశోక్ మత్స్యకారులు రైతులు తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview