అందేశ్రీ జీవిత పయనంపై అక్షిత మీడియా కథనం

 



తెలంగాణ దళిత కవి తెలంగాణ గీత రచయిత అందే శ్రీ చరిత్ర 

హైదరాబాద్ ,అక్షిత మీడియా;-

అందెశ్రీ అంటేనే పాట కవిత్వం బాట తను ప్రయాణం ఒక ముళ్ళ పాన్పు జీవితంలో కష్టాలు సుఖాలు ఎరిగిన అవతాలికుడు అందెశ్రీ. తెలంగాణ ఉద్యమంలో తన పాట ద్వారా ఎంతో మoది ఉరకలెత్తి ఇచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనకు తాను చేసిన పని అంతా కాదు వర్ణాతీతం. 1961 ప్రస్తుతం ఉన్నటువంటి జనగాం జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో అందే బోడ్డయ్య ,ఎల్లవ్వ దంపతులకు1961 జులై 18న జన్మించిన అందెశ్రీ. అందెశ్రీ పూర్తి పేరు అండే ఎల్లయ్య . ఒక దళిత సామాజిక వర్గంలో జన్మించినటువంటి అందెశ్రీ తాను పడ్డ కష్టాలు బాధలు అవే చదువుకో మలుకొని  తాను ఎటువంటి అక్షరాభ్యాసం చేయకపోయినప్పటికీ కూడా తన యొక్క జీవితాన్ని చదివి జీవితము యొక్క మలుపులు ఆధారంగా చేసుకొని తన పాటని బాటని మాటని యాసిని ప్రజలకి తెలియజేయడంలో అందెశ్రీ ది ఒక ప్రత్యేకత, తెలంగాణలో ఉన్నటువంటి కవులు కళాకారులు ప్రత్యేక ప్రసిద్ధి పొందిన కవులలో ఒకరైనటువంటి అందెశ్రీ ఎన్నో కష్టాలను అధిగమించి తన యొక్క ఎదిగినటువంటి గొప్ప అవతాలికుడు అందెశ్రీ. 




అందే శ్రీ జీవితంలో మరొక మైలురాలిగా నిలిచేది తన జీవిత సహచరిని ఎంచుకోవడలో తన జీవిత భాగస్వామిగా మల్లమ్మని , అందెశ్రీ దంపతులకు ఒక కుమారుడు ముగ్గురు కుమార్తెలు మామూలు సాదాసీదా జీవితాన్ని గడిపినటువంటి అందెశ్రీ, కుటుంబ పోషణ కూడా చాలా ఇబ్బందులు కరమైన పరిస్థితి ఎదుర్కొన్న పరిస్థితి అనేకం తన జీవితంలో జరిగిన తను అనేక వేదికల మీద కూడా పంచుకున్న పరిస్థితి.


అందెశ్రీ తాను జీవిత పయనంలో గొడ్ల కాపరిగా ప్రారంభించిన జీవితాన్ని తాను గుడ్ల  కాస్తూ జీవిత  . గోడ్డ కాసుకునేటప్పుడు పాడిన పాటల్ని విన్న శృంగేరి మఠం చెందిన స్వామి శంకర మహారాజ్ చేరతీయటంలో ఆయన జీవితంలో కీలక మలుపు తిరిగింది చదువు లేకపోయినా ఆయన కవిత్వ ప్రతిభకు బాట వేసింది కూడా స్వామీజీని, తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ధూంధాం కార్యక్రమాలు 10 జిల్లాల్లో ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి రగిలించింది కూడా అందెశ్రీ తన పాటల ద్వారానే తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటారు. అందెశ్రీ రాసిన పాటల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాట 




మాయమైపోతున్నదమ్మా మనిషన్నవాడు మచ్చికైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు కోటికో కూటికో ఒక్కడే ఒక్కడు రాసిన పాట ఎప్పటికీ మదిలో నిలిచిపోయే విధంగా చిరస్మారంగా ఉంటూనే ఉంటుంది

జై బోలో తెలంగాణ సినిమాలో జై బోలో తెలంగాణ జన గర్జన జడివాన అనే అందెశ్రీ పాడితే ఉస్మానియా యూనివర్సిటీలో ఉరకలెత్తిన ఉద్యమ పోరాటం,




తెలంగాణ బాటని వ్యాసని సాంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబచే విధంగా తాను రాసినటువంటి జయ జయహే తెలంగాణ గీతాన్ని గొప్ప మేధావి అందెశ్రీ. తెలంగాణ రాష్ట్ర సాధనలో తాను రాసినటువంటి పాటలతో ఎన్నో ఉద్యమ బాటలు వేసినట్లు చరిత్ర పుటల్లో నిలిచిన గొప్ప అవతాలికుడిగా అందే శ్రి మిగిలిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందెశ్రీ రాసిన పాటని పరిగెలను తీసుకోలేదు. ఆవేదనకు గురైన పరిస్థితి   కూడా మనం చూసాం, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయం పైన తన యొక్క పాట ద్వారా తన యొక్క గజ్జల మోత ద్వారా తాను చేసిన పోరాటం అంతా కాదు తెలంగాణ రాష్ట్ర సిద్ధించిన తర్వాత 2025 జూన్ రెండో తారీకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాను రాసినటువంటి జయ జయహే తెలంగాణ గీతాన్ని తెలంగాణ గీతం గా పరిగణలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అధికార గీతం గా ప్రకటించడంతో అందెశ్రీ తాను చేసిన కష్టం నేడు నేను జీవించినప్పుడే ఫలించింది అని పడ్డ సంతోషం అంతా ఇంతా కాదు. 




అందెశ్రీ తన పాటలకి గాను అనేక అవార్డులు కూడా పొందడం జరిగింది 2006లో గంగ సినిమాకి అందెశ్రీ కి నంది అవార్డు పురస్కారం 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సిటీ గ్లోబల్ పీస్ డాక్టరేట్. 2017 లో దాశరధి సాహిత్య పురస్కారం అందుకున్నారు. 2015లో రావూరి భరద్వాజ్ సాహిత్య పురస్కారం. 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం 2024లో దాశరధి కృష్ణమాచార్యులు సాహిత్య పురస్కారం లోక నాయక్ పురస్కారం 2025లో తాను రాసిన జయ జయహే తెలంగాణ గీతం గా అధికారికంగా ప్రకటించడమే కాకుండా కోటి రూపాయలు రివార్డు కూడా తెలంగాణ ప్రభుత్వం అందించడం తదితర మరెన్నో అవార్డులు పొందిన గొప్ప అవతాలికుడు అందెశ్రీ. 





2025 నవంబర్ పదో తారీఖున ఉదయం గుండెపోటు రావటంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ కూడా అప్పటికి అందెశ్రీ చనిపోయాడని డాక్టర్లు నిర్ధారణ చేయడంతో ఆ కుటుంబం శోకసముద్రంలో మేలిపోయిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు నిర్వహించి. గొప్ప విశేషం ఏందంటే అందెశ్రీ అంత్యక్రియలలో సీఎం రేవంత్ రెడ్డి తానే ఒక కొడుకుగా తాను సొంత బంధువుగా అందెశ్రీ తన కుటుంబంలో ఒక వ్యక్తిగా భావించినట్లు తన పాడిన సైతం మోసిష్ఠమే కాకుండా తన సహచర మంత్రులతో తన యొక్క దశదిన కార్యక్రమం సైతం దగ్గరుండి పర్యవేక్షించారంటే అందెశ్రీ ప్రజల మనసు ఏ విధంగా పొందగలిగిన గొప్ప వ్యక్తి మనందరికీ తెలుస్తూనే ఉంది . కవిత్వానికి మరణం లేదు అంటానికి నిలువెత్తు నిదర్శనమే మన అందెశ్రీ.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు