*గంజాయి రవాణా అడ్డుకున్న ఎక్సైజ్ అధికారులు*...
భద్రాచలం ,అక్షిత మీడియా;-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..
భద్రాచలం ఆర్టీఏ చెక్‌పోస్ట్ ఎదురుగా ఎక్సైజ్ అధికారులు విశ్వసనీయ సమాచారం మేరకు వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో ఆంధ్రప్రదేశ్‌లోని సీలేరు, మోతుగూడెం ప్రాంతాల నుండి భద్రాచలం మీదుగా హైదరాబాదుకు గంజాయి రవాణా చేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వద్ద నుండి సుమారు 20 కేజీల ఎండు గంజాయి, ఒక కారు, ఒక మోటార్ సైకిల్, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.11 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.
నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
ఈ దాడుల్లో భద్రాచలం ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సీఐ రహీమున్నిసా బేగం, సబ్‌ఇన్‌స్పెక్టర్ అల్లూరి సీతారామరాజు , సిబ్బంది పాల్గొన్నారు.

0 కామెంట్‌లు