ఇందిరమ్మ రాజ్యమంటే పేదవాడికి ఇల్లు లేకుండా చేయటం ఎల్ హెచ్ పి ఎస్ . బద్రు

 



*సమయం ఇవ్వకుండా ఇల్లు కూల్చడం దారుణం* 

 *నాగర్ కర్నూల్ లో కుల వివక్షతకు పసిపాప బలి* *అమానుషం** 

 *రాజేష్ లాక్అప్ డేత్ పై విచారణ చేయించాలి* 


ఖమ్మం, అక్షిత మీడియా;-

 *ఇందిరమ్మ రాజ్యమని , పేదల ప్రభుత్వమని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం వెలుగుమట్లలో సమయం ఇవ్వకుండా తెల్లవారుజామునే పేదల ఇల్లు కూల్చడం దారుణమని వీర నారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉపేంద్ర బాయి ఆగ్రహం వ్యక్తం చేశారు.  వెలుగుమట్ల భూదాన బాధితులను పరమార్శించిన అనంతరం సంఘం జిల్లా కార్యాలయంతో మీడియాతో మాట్లాడారు. భూదాన భూములు అంటే పేదల భూములనీ అలాంటి భూములనుండి పేదలను ఇల్లు కూల్చి , అక్కడినుండి గెంటి వేయడం బాధాకరమన్నారు. ఆ పేదలకు అక్కడే డబుల్ బెడ్ రూములు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే నాగర్ కర్నూల్ జిల్లా లోని కుమ్మెర గ్రామంలో గల మల్లన్న జాతర ఒక చిన్నారి నుంచి వేసిన కుల వివక్షతపై* , అందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అగ్రవర్ణాల కారణంగా వ్యవస్థ వారికి వెన్నుదన్నుగా నిలిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి ఎస్గ్రేషియే , ప్రభుత్వ ఉద్యోగం , ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లాకప్ డెత్ గురైన రాజేష్ కుటుంబం ను కూడా ఆదుకోవటంతో పాటు ఈ విషయంపై సమగ్ర విచారణ చేపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూల్చివేతలు తప్ప నిర్మాణాలు లేవని , నియంతృత్వం తప్ప ప్రజాస్వామ్య కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితులు ఇలాగే ఉంటే గత ప్రభుత్వానికి పట్టిన గతి పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బానోతు బద్రు నాయక్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి కే. స్పందన , జిల్లా ఉపాధ్యక్షురాలు భూక్య జ్యోతి ,జిల్లా కార్యదర్శి జర్పుల సుభద్ర , జిల్లా సహాయ కార్యదర్శి బి. త్రివేణి , నాయకులు నల్ల నాగమణి , ప్రమీల , ఝాన్సీ ,విజయ ,లక్ష్మి, భవాని తదితరులు పాల్గొన్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview