హమాలి మేస్త్రి ఆత్మహత్య ప్రయత్నం

 




హమాలీ మేస్త్రి ఉప్పరి సమ్మయ్య ఆత్మహత్యాయత్నం 

కక్ష సాధింపు ధోరణి దీనికి కారణం 

నా భర్త ఈ పరిస్థితికి రావడానికి కారణం మడుగు సాంబమూర్తి

ఇల్లందు, అక్షిత మీడియా:-

ఇల్లందు మున్సిపాలిటీకి  జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమిక కారణం మీరే అని కక్ష సాధింపులు ధోరణిలో భాగంగా హమాలి మేస్త్రి ఉప్పరి సమ్మయ్య పై ఇబ్బందులకు గురి చేసిన దానిలో భాగంగా ఆత్మహత్యయత్నం చేసుకున్న పరిస్థితి ఇల్లెందు పట్టణంలోని 13వ వార్డు నందు జరిగింది. వివరాలకు వెళ్తే గత ఎన్నికలలో మడుగు సాంబమూర్తి కుమార్తె 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయటం బి ఆర్ఎస్ పార్టీ నుంచి దండు సారయ్య పోటీ చేయటంతో సారయ్యకి

మద్దతు తెలిపి ఆయన గెలుపులో కృషి చేశాడు అన్న ఉద్దేశంతో హమాలి ముఠా 72మందికి మేస్త్రి గా వ్యవహరిస్తున్నటువంటి ఉప్పరి సమ్మయ్య పై కక్ష సాధింపులు ధోరణి లో భాగంగా అతనిని ముఠా నుంచి తొలగిస్తూ చర్యలు తీసుకున్న విధంగా మడుగు సాంబమూర్తి అధికార పార్టీ నీ ఉపయోగించుకొని ముఠామేస్త్రి, హమాలీ సభ్యుడిగా తొలగిస్తూ ఇబ్బందులకు గురి చేయటానికి తట్టుకోలేక తన ఇంటిలో ఎవరు లేని సమయం చూసుకొని ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేయటంతో తక్షణమే తెలుసుకొని అతని హాస్పటల్ చేర్చడం జరిగింది. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ నా భర్త ఈ విధంగా కావటానికి కారకుడైన మడుగు సాంబమూర్తి పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న బాధితుని భార్య కుటుంబ సభ్యులు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview