అసలు వాగు వైశాల్యం ఎంత?




 బుగ్గ వాగు రిటర్నింగ్ వాల్ నిర్మాణంలో నిబంధనలు పాటిస్తున్నారా!!!

అసలు బుగ్గ వాగు వైశాల్యం ఎంత. ?

ఎంత మేరకు వాగు ఆక్రమాలకు గురయిందో .!!!

ఇల్లందు ,అక్షిత మీడియా;-

ఇల్లందు పట్టణంలో నడి ఒడ్డున ఉన్నటువంటి బుగ్గ వాగు ప్రవాహం తో వర్షాకాలంలో సమీప నివాస గృహాలలోకి వరద నీరు చేరటంతో అనేక ఇబ్బందులు గురి అవుతున్న పరిస్థితులను చూసి గత ప్రభుత్వంలో దాని ఇరువైపులా రిటర్నింగ్ వాలు నిర్మాణం జరపాలని మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేసి దానికి అవసరమైనటువంటి నిధులు కేటాయించి టెండర్లు పిలవడం జరిగింది దానిలో భాగంగా నిర్మాణం అనేది నత్త నడిపిన సాగుతుంది తప్ప నిర్మాణం శరవేగంగా పూర్తి చేసి ప్రజలకి వరద ముంపు నుంచి నివృత్తి జరిగే విధంగా చర్యలు తీసుకుని నాధుడు లేకుండా పోయాడు. అంటానికి నిలువెత్తు నిదర్శనమే నిర్మాణంలో జరుగుతున్న అలసత్వం, ముఖ్యంగా బుగ్గ వాగు ఇరువైపులా ఆక్రమార్కు గురై వాగు లోపలికి చొచ్చుకొని వచ్చి మరి నిర్మాణాలు జరిపించిన పరిస్థితులు కంటికి కనిపిస్తున్నప్పటికీ కూడా చూసి చూడనట్టు మున్సిపల్ అధికారులు పాలకవర్గం ఉండటం వెనక రాజకీయ అండదండలు ఉన్న నాయకులు, ఇతర వ్యక్తులు ఆ ప్రాంతంలో వారికున్న స్థలాన్ని మించి వాగులోకి తెచ్చుకోవచ్చు మరి నిర్మాణాలు జరిపిస్తున్నప్పటికి కూడా నడి ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్న అధికారుల కల్లోల కనిపించుకుపోవటానికి కారణం వారి యొక్క అలసత్వమా లేక చేతివాటమా తెలపాల్సిన అవసరం ఉందని గతంలో బుగ్గ వాగుకు ముంపు ఏర్పడినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక గృహాలలోకి వరద నీరు చేరడమే కాకుండా కింది అంతస్తు వరకు మొత్తం మునిగిపోయిన పరిస్థితులు కూడా గతంలో చూసాం అప్పుడున్న పాలకవర్గం దానికి ప్రయత్నం గా బొగ్గు వాగు లో కి కాలువల ద్వారా వస్తున్నటువంటి వరదనీరు ఇళ్లలోకి రావకుండా ఉండటం కోసం ప్రధాన కాలువకి ఇరువైపులా ఎత్తైన గోడలు నిర్మించడం జరిగింది. దీని ద్వారా కొంత ప్రాంతానికి ముంపు ప్రభావం తప్పినప్పటికీ మేజర్ గా ఉన్నటువంటి ఏదైతే వరద ముంపు ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో కూడా మరమ్మత్తులు జరిపించి దానికి ఎత్తైన గోడ నిర్మాణం చేసినట్లయితే వరద నుంచి నివాసల్లోకి వరద నీరు రాకుండా అడ్డుకట్ట వేయొచ్చు అన్న ఉద్దేశంతో ఈ నిర్మాణాలు ప్రారంభించినప్పటికీ కూడా నేటికీ పనిలో అధికారులు పర్యవేక్షణ లోపం ఆ ప్రాంతంలో అక్రమణాలకు గురవడంతో నిర్మాణం చేపట్టే ప్రాంతంలో అనేక ఇబ్బందులకు ఎదురవుతున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అధికారులు తక్షణమే దీనిపై స్పందించి ఆక్రమణలను తొలగించి వాగుకు నిర్మిస్తున్నటువంటి గోడ నిర్మాణాన్ని జరిపించాలని కోరుకుంటున్నా. ఇల్లెందు ప్రాంత ప్రజలు మరిన్ని ముఖ్యమైన సమాచారంతో మీ ముందుకు వస్తాం .మీ అక్షిత మీడియా యాజమాన్యం,,!!!!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview