*త్రిబుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు – జిల్లా ఎస్పీ నితిక పంత్ ఐపీఎస్*

 


కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, అక్షిత మీడియా;_

త్రిబుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్ మరియు మైనర్ డ్రైవింగ్‌ చేయటం నిషేధమని, మైనర్ వాహనం నడిపి పట్టుబడిన సందర్భాల్లో వాహన యజమానిపై కూడా కేసు నమోదు చేయబడుతుందని జిల్లా ఎస్పీ నితిక పంత్ ఐపీఎస్ హెచ్చరించారు.

వాహన యజమానులు మైనర్ వ్యక్తులకు వాహనాలు ఇవ్వరాదని, మైనర్ వాహనం నడిపినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఈ ప్రమాదాలు వాహన యజమానితో పాటు ఇతర వ్యక్తులకు కూడా నష్టం కలిగించే అవకాశముందని, కాబట్టి మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని ఎస్పీ  సూచించారు.

అలాగే, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం, నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడపడం, నంబర్ ప్లేట్ దాచడం లేదా తప్పుడు నంబర్లు ఏర్పాటు చేయడం, ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా శబ్ద కాలుష్యాన్ని సృష్టించే విధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను కలిగి ఉన్న వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొందరు వాహనదారులు నంబర్ గుర్తించలేని ఫ్యాన్సీ డిజైన్ లేదా తప్పుడు నంబర్లు ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా అన్ని వాహనాల నంబర్ ప్లేట్లను నిబంధనలకు అనుగుణంగా సరిగా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.

అదేవిధంగా, రాంగ్ సైడ్ పార్కింగ్, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం, బాధ్యతారాహిత్యంగా ఓవర్ లోడెడ్ వాహనాలు నడపడం వంటి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ తెలిపారు.

వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు మరియు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలి, ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలన్నారు. ప్రజ భద్రత కొరకు జిల్లా వ్యాప్తంగా నిరంతర తనిఖీలు చేపడతామని తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview