ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు.
చిన్నమండవ లో చెక్ పోస్టు ఏర్పాటు చేసిన ఎస్ ఐ వీరేందర్.
చింతకాని మండలంలో ఎటువంటి ఇసుక రవాణా కు ప్రభుత్వ అనుమతులు లేవు అని మండల పరిధిలోని చిన్నమండవ గ్రామంలో పర్యటించి మున్నేరు నది నుంచి ఇసుకను తరలించకుండా నదికి వెళ్లే దారిలో అడ్డుగా పెద్ద గుంత తవ్వి చిన్నమండవలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు.అనంతరం ఎస్ ఐ వీరేందర్ మాట్లాడుతూ అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.


0 కామెంట్‌లు