గిరిజన కుంభమేళ, మేడారం జాతర పై




  1.  మేడారం అనగానే గుర్తుకు వచ్చేది
  2.  గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర 
  3. అసలు సమ్మక్క, సారలమ్మ ఏమవుతారు ?
  4. అసలు ఈ జాతర ఎలా వచ్చింది. అసలు ఎవరు ఈ సమ్మక్క, సారలమ్మ ?
  5. అసలు జంపన్న వాగుకు ఆ పేరు ఎందుకు వచ్చింది  ?
  6. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు కొయ్య రాజు అయినటువంటి పగిడిద రాజు పై యుద్ధం ఎందుకు ప్రకటించాడు? 
  7. సమ్మక్క చిలకలగుట్ట వద్ద అదృష్టం అవ్వటానికి కారణం ఏంటి ?

మేడారం ,అక్షిత మీడియా;-




1260 నుంచి1320 వరకు కన్న ముందు ఓరుగల్లు ను పరిపాలించినటువంటి ప్రతాప రుద్ర చక్రవర్తి .

దగ్గర కరీం నగరాన్ని  పరిపాలించినటువంటి మేడారాజు కు పగిడిద్ద రాజు మేనల్లుడు . పగిడిద రాజు మేడారం ప్రాంతంలో పాలించి ఆ ప్రాంతంలో కాకతీయుల రాజులకి కప్పం కడుతూ వారి యొక్క సామంత రాజ్యంలో వీరి రాజ్యం కూడా ఒకటి. పగిడిద్ద రాజు వివాహం ఆడిన మహిళ సమ్మక్క. పగిడిద్ద రాజు సమ్మక్కల దంపతులు 

ముగ్గురు సంతానం ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు 

సారలమ్మ ,నాగులమ్మ కుమార్తెలు, జంపన్న కుమారుడు 

మేడారాన్ని పాలించినటువంటి కోయ రాజులు పగిడిద్ద రాజు రాజ్యంలో నాలుగైదు సంవత్సరాలు కరువు కాటకాలతో విలయ తాండవం చేస్తున్న తరుణంలో కాకతీయ సామంతులకు కప్పం కట్టలేదు. కట్టలేని దయనీయ స్థితిలో ఉన్నప్పుడు కప్పం కట్టాల్సిందే అని కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు హుకుం జారీ చేయడం జరిగింది. వారి జారీ చేసిన హుకుం నీ తిరస్కరించినటువంటి పగిడిద రాజు యుద్ధానికి కూడా సిద్ధమైన పరిస్థితి. దీనికి ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రతాపరుద్రుడు వారి సైన్యంతో కోయరాజుపై యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది. దానికోసం వారి సైన్యాన్ని ఇప్పుడున్నటువంటి ములుగు జిల్లా ములుగు ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి లకారం సరస్సు వద్ద స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని యుద్ధగెంటికల్ మోగించడం జరిగింది. పగిడిద రాజు వారి  కుమార్తెలు సారలమ్మ, నాగులమ్మ, కుమారుడు జంపన్న తో కలిసి సంపంగే వాగు వద్ద వారి సైన్యంతో స్థావరాన్ని ఏర్పరచుకొని యుద్ధానికి సిద్ధమని సంకేతం పంపించడం జరిగింది. తర్వాత కాకతీయులు సైన్యం చేతిలో నాగులమ్మ సార్లలమ్మ , సారలమ్మ భర్త గోవిందరాజు కాకతీయుల సైన్యం చేతిలో చనిపోవడం జరిగింది. ఇది చూసిన జంపన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యాయత్నం చేస్తున్నాడు. దీన్ని చూసి చలించిపోయినటువంటి సమ్మక్క యుద్ధ రంగంలోకి ఈటలు బల్లెంతో వచ్చి కాకతీయ సైన్యంపై దండయాత్ర చేయడం జరిగింది. కాకతీయ సైన్యం సమ్మక్క చేస్తున్న యుద్ధభేరికి తట్టుకోలేక కాకతీయ సైన్యం పరుగులెత్తించే పరిస్థితి వచ్చిన పరిస్థితుల్లో, కాకతీయ సైన్యం సమ్మక్క చేస్తున్న వీరోచిత పోరాటాన్ని ,చూసి తట్టుకోలేక సమ్మక్కను కాకతీయ సైనికుడు వెనకనుంచి  బల్లెంతో పొడవడం జరిగింది. దీనితో సమ్మక్క పక్కనే ఉన్నటువంటి మేడారం గ్రామానికి ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి చిలకలగుట్ట వైపు వెళ్లి కొద్ది దూరం తర్వాత గట్టు మలుపు తిరిగిన తర్వాత సమ్మక్క అదృశ్యం అవటం. అదృశ్యమైన సమ్మక్క కోసం ఎంతగానో వెతికినా కాకతీయ సైన్యానికి దొరకపోవడంతో వారు వెనితిరికి ఓరుగల్లు పాలించినటువంటి ప్రతాపరుద్రుడుతో చెప్పటంతో. ప్రతాపరుద్రుడు కూడా దీనిపై సమగ్ర విచారణ జరిపించడంతో కొయ్య రాజ్యం మొత్తం అనావృష్టితో ఇబ్బందులకు గురైన పరిస్థితి తెలుసుకొని తాను చేసిన తప్పుకి ప్రచాతాపం వ్యక్తం చేస్తూ అదృశ్యమైన సమ్మక్కకి భక్తుడిగా మారి. 



అప్పటినుంచి మేడారం ప్రాంతంలో చిలకలగుట్ట వద్ద సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించడం ఆనవాయితీగా మారిన పరిస్థితి తర్వాత క్రమేపి చిలకలగుట్ట వద్ద నుంచి మేడారం ప్రాంతానికి జాతరను మార్చి. వనదేవతల్ని గద్దల వద్దకి తీసుకురావటం సారలమ కన్నెపల్లి నుంచి సమ్మక్కను చిలకలగుట్ట నుంచి ఆదివాసి పూజారులు గద్దల వద్దకు తీసుకురావడం అనేది ఆనవాయితీగా వస్తూనే ఉంది. దేవత పూజారులైన సిద్దబోయిన వారింటి కి వస్తారు అనేది ఆయన ఆనవాయితీ. సమ్మక్కను చిలకల గుట్ట నుంచి తీసుకొచ్చేటప్పుడు పోలీస్ యంత్రాంగం 10 రౌండ్ల తుపాకీ కాల్పులు జరపటం అనేది దేవతని గద్దె మీదకు తీసుకొస్తున్నారు అంటానికి నిదర్శనం. అనంతరం భక్తుల యొక్క మొక్కుబడులకు సమర్పించుకుని గద్దెల వద్ద నుంచి వన ప్రవేశం తోని మేడారం జాతర ముగుస్తుంది.




1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేడారం జాతర అనేది రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన పరిస్థితి. కుంభమేళా తర్వాత ఆ స్థాయిలో ప్రజాధరణ పొందిన ఏకైక జాతర గిరిజన జాతరగా పేరుందిన మేడారం జాతరకు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలైనటువంటి మధ్యప్రదేశ్ ఛత్తీస్గడ్ మహారాష్ట్ర ఒరిస్సా తదితర పురుగు రాష్ట్రాలే కాకుండా హిమాచల ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ సిక్కిం తదితర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు రావటం అనేది విశేషం. ఇంకొక ముఖ్య విషయం ఏందంటే దేశంలోనే కుంభమేళా తర్వాత భారత దేశంలో అతిపెద్ద గిరిజన జాతరగా పేరుందినటువంటి మేడారం జాతరకు 2008 ఫిబ్రవరిలో జరిగిన జాతరకు సుమారు కోటి చిల్లర మంద భక్తులు వచ్చారు అని అంచనా. ఇద్దరు విగ్రహం లేని జాతర. సమ్మక్క సారలమ్మ జాతర గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిమభిస్తుంది.

 ఇది చరిత్ర చెబుతున్న అపూర్వ ఘట్టం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు